‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ రివ్యూ

0
272

అల్లరి నరేశ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఆయన కొన్ని సీరీయస్ సబ్జెక్టులను కూడా చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. అందులోనే వచ్చినవి రెండు చిత్రాలు ఒకటి ‘నాంది’ కాగా రెండోది ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నరేశ్ ఈ చిత్రాన్ని ఇటీవల ఎంచుకున్నాడు. నేడు (నవంబర్ 25)న విడుదలైన ఈ చిత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టోరీ లైన్

ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శ్రీపాద (నరేశ్) నీతి, నిబద్ధతతో బాధ్యతాయుతంగా ఉంటాడు. ఎలక్షన్లు రావడంతో ఆయనకు మారేడుపల్లి అనే తండాకు ఎలక్షన్ ఆఫీసర్ గా పంపుతారు ఉన్నతాధికారులు. ఎటువంటి గుర్తింపునకు నోచుకోని ఆ తండాను, అక్కడి ప్రజల స్థితిగతులను చూసిన శ్రీనివాస్ చలించిపోతాడు. వీరి దీన స్థితిని బాహ్య ప్రపంచానికి చూపించాలని అనుకుంటాడు. అందుకు ఒక యుద్ధం మొదలు పెడుతాడు. శ్రీనివాస్ చేసిన పనులు వారికి ఏ మేరకు కలిసి వచ్చాయో సినిమాలో చూడాల్సిందే..

విశ్లేషణ

న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా, పోలీసుల అరాచకాలను ఎండగడుతూ తీసిన చిత్రం ‘నాంది’. ఇది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇదే తరహాలో మరో మూవీని ఎంచుకోవాలి అనుకున్నాడు నరేశ్. అందులోని భాగంగానే వచ్చింది ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంకా ప్రభుత్వ ఫలాలకు అల్లంత దూరంలో ఉన్న వారి స్థితిగతులను ఈ మూవీలో తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్. కమర్షియల్ అంశాలను స్ప్రషించకుండా సూటిగా పాయింట్ చెప్పాలనుకున్నాడు. ఇందులో కామెడీకి అవకాశమే ఇవ్వలేదు. వెన్నెల కిశోర్ తో కొంచెం కామెడీ క్రియేట్ చేసినా అది ఏ మంత ఆకట్టుకోలేదు.

పతాక సన్నివేశాలు

ఫస్ట్ ఆఫ్ పాత్రల పరిచయం, నేపథ్యం గురించే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ ఆఫ్ లో పాత్రల పరిచయం తర్వాత సెకండ్ ఆఫ్ కొంచెం ఆకట్టుకుంది. కథ మూలాల్లోకి వెళ్తుంది. సీరియస్, ఎమోషన్ పండించడం నరేశ్ కు కొత్తేమి కాదు. నేను, ప్రాణం లాంటి చిత్రాల్లో కూడా మెప్పించారు ఆయన. ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో నరేశ్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ మూవీలో నటనా పరంగా నరేశ్ ఆడియన్స్ ను మెప్పించడంలో సక్సెస్ అయినా మిగతా అంశాల్లో కొంచెం వెనుబడిపోయిందని తెలుస్తుంది.

నటులు, పాత్రలు

అల్లరి నరేశ్ హీరోగా చేయగా, ఆయన సరసన ఆనంది హీరోయిన్ గా చేసింది. కమర్షియల్ కోణం టచ్ చేయకపోవడం, స్లోగా సాగే స్ర్కీన్ ప్లేతో చిత్రం నిరాశపరిచింది. నరేశ్ మూవీలో కనీస స్థాయి కామెడీ ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఇందులో అది కనిపించదు. ఈ మూవీ హిందీ హిట్ మూవీ ‘న్యూటన్’ను పోలి ఉండగా, దానంత స్థాయిలో విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి మరి.

ప్లస్ లు: అల్లరి నరేశ్ నటన, కథ, పతాక సన్నివేశాలు
మైనస్ లు: స్లోగా సాగే ఎలిమెంట్స్, స్ర్కీన్ ప్లే

చివరగా

ఒక సామాజిక అంశాన్ని ఎత్తి చూపిన డైరెక్టర్ మోహన్ తెగువకు మెచ్చుకోవాల్సిందే. అల్లరి నరేశ్ తన పాత్రలో సరిగ్గా ఒదిగిపోయారు. స్లో స్ర్కీన్ ప్లే.. కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం వంటివి నిరాశ కలిగించినా చూడదగిన చిత్రమే..

రేటింగ్: 2.5/5