900 మందితో పవన్ ఫైట్ సీన్.. రూ. 10 కోట్లు ఖర్చు

0
260

టాలీవుడ్ ఇండస్ర్టీలో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో అరంగేట్రం చేసి రాకెట్ కంటే వేగంగా దూసుకుపోయి వెండితెరపై కీర్తి ప్రతిష్టలు సంపాందింది తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన. ఇటు ఏపీ పాలిటిక్స్ లో కొనసాగుతూ.. సమానంగా వెండితెరకు కూడా సేవలు అందిస్తున్నారు.

ఫైట్స్ సీన్ అదుర్స్

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని రోజుల నుంచి సాగుతోంది. సినిమాకి సంబంధించి ఒక భారీ ఫైట్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. దీని కోసం రూ. 10 కోట్లతో భారీ సెట్లు వేయించారు. ఫైట్ సీన్ లో పవన్ కళ్యాణ్ గడ్డంతో గ్రాండ్ లుక్ గా కనిపిస్తాడు. దీనికి సంబంధించిన ఒక టీజన్ ను చిత్ర యూనిట్ గురువారం (నవంబర్ 25)న విడుదల చేసింది. ఇందులో పవన్ యాక్షన్ సీన్ ను చూసిన అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తూ సినిమా ఎప్పుడస్తుందా అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.

క్రిష్ ఏమన్నారంటే

‘హరి హర వీరమల్లు’పై డైరెక్టర్ క్రిష్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ‘ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుంది, కథకు కూడా మంచి చరిత్ర ఉంది. దీన్ని ప్రేక్షకులు ఆస్వాదించేలా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ నిరంతరం శ్రమిస్తోంది. ఇప్పటి వరకూ సాగిన షూటింగ్ అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభించగా శరవేగంగా సాగుతోంది. హీరో పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది ఆర్టిస్ట్ లు కొన్ని రోజుల నుంచి ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

చిత్ర సీమకు ఒక గీటురాయిగా

ఈ మూవీ కేవలం పవన్ కే కాదు టాలీవుడ్ చిత్ర సీమకు ఒక గీటురాయిగా ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పవన్ అభిమానులు, సినీ అభిమానులు చిత్రాన్ని చూసి ఆనందం వ్యక్తం చేయడం ఖాయం. ఈ చిత్రంతో మన ఇండస్ర్టీకి కీర్తి పెరుగుతుంది. తాము చేసే నిర్మించే ఈ కళాఖండంలో అందరి ప్రేమ, ఆదరాభిమానాలు కావాలి’ అంటూ చెప్పుకచ్చాడు క్రిష్.