రష్యన్ లో భాషలో ‘తగ్గేదేలే’కు క్రేజీ ట్రోల్స్

0
236

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ హీరో అలు అర్జున్ నటించిన మూవీ ‘పుష్ప’. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మొదట దర్శకుడు తెలుగులో హిట్ అవుతుందని భావించాడు. కానీ ఆయన ఊహకు అందకుండా తమిళ్, మలయాళం, హిందీలో కూడా బాక్సాఫీస్ హిట్లను తిరగరాసింది. ఒక్క బాలీవుడ్ (హిందీ)లోనే దాదాపు రూ. 100 కోట్లను వసూలు చేసిందంటే ఏ మేరకు ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు.

అన్ని భాషలతో కలుపుకొని ఇది ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ ను సాధించిందని చిత్ర యూనిట్ చెప్తున్నది. పుష్ప రిలీజై ఏడాది దగ్గరికి వస్తున్న క్రమంలో రష్యాలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్లుగా అన్ని సిద్ధం చేసింది.

ట్రైలర్ కే గ్రేట్ వ్యూవ్స్

త్రిపుల్ ఆర్ జపాన్ లో రిలీజై రికార్డులను బద్దలు కొడుతుండగా, రష్యాలో పుష్ప రిలీజ్ చేయాలని పుష్ప చిత్ర యూనిట్ భావించింది. రష్యాలో ఇండియన్ మూవీస్ అడపా దడపా విడుదల అవుతూనే ఉంటాయి కానీ అవి మాన భాషవే (ఒరిజినల్ లాంగ్వేజ్) అయి ఉంటాయి. అక్కడి భారతీయుల కోసం వీటిని విడుదల చేస్తుంటారు. కానీ పుష్ప మాత్రం అలా రిలీజ్ చేయడం లేదు.

పూర్తిగా రష్యన్ భాషలోనే (డబ్ చేసి) విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ పనులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రష్యా భాషలో ఇటీవల ఒక ట్రైటర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కూడా ‘తగ్గేదేలే’ అంటూ గ్రేట్ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. ఇందులో పుష్ప తగ్గేదేలే డైలాగ్ ఇప్పుడు అక్కడ అభిమానులు విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు.

లోకల్ సినిమాలను పక్కన పడేసిన పుష్ప

రష్యా ఫిలిం ఇండస్ర్టీలో ఎన్నో సినిమాలను పక్కన బెట్టి పుష్ప రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ర్టిబ్యూటర్స్ ముందుకు వస్తున్నారట. పైగా పూర్తిగా రష్యన్ లాంగ్వేజ్ వచ్చే ఈ మూవీని చూసేందుకు ఆ దేశ ప్రజలు ఉత్సాహం చూపడం విశేషం. చిత్రంపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు.

భారీ ప్రమోషన్స్

ఇండియాలో మాదిరిగానే రష్యాలో కూడా భారీ ప్రమోషన్ చేయాలని సినిమా నిర్మాణ సంస్థ భావిస్తుంది. డిసెంబర్ 8న రష్యా దేశ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తేదీని కూడా ప్రకటించారు. రష్యాలో ఎలా ఆడుతుందో తెలుసుకోవాలని అల్లు ఫ్యాన్స్, చిత్ర నిర్మాణ సంస్థ ఎదిరి చూస్తున్నాయి.

అక్కడ చిత్రం రికార్డులను తిరగరాస్తే భవిష్యత్ లో మన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుందని, ఇప్పటికే త్రిపుల్ ఆర్ జపాన్ లో 400 మిలియన్ యెన్ లను దారి పరుగులు తీస్తుంది. ఇది కూడా అదే రేంజ్ లో వసూళ్లను సాధిస్తే ఇండియన్ సినిమా, అందులో టాలీవుడ్ ఇండస్ర్టీకి మరింత గుర్తింపు దక్కుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.