‘ఐ లవ్ యూ’ చెప్పిన కొడుకు ఫ్రెండ్

0
1247

యాంకర్ గా సుమకు టాలీవుడ్ ఇండస్ర్టీలో యమా క్రేజ్ ఉంది. ఆమె వాగ్ధాటికి స్టార్ హీరోలు సైతం చతికిల పడాల్సిందే.. బెసిక్ గా కన్నడియన్ అయిన సుమ రాజీవ్ కనకాలను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అయ్యింది. తర్వాత ఆమె యాంకరింగ్ వైపు దృష్టి పెట్టింది. తెలుగు భాషపై మక్కువ పెంచుకొని బుల్లితెర, వెండితెరను సైతం ప్రస్తుతం ఏలుతుందంటే సందేహం కాదు. ఇటీవల ఆమె తీసిన సినిమా ‘జయమ్మ పంచాయతీ’ మంచి హిట్ గానే నలిచింది. ఇందులో ఆమె నటనను భేష్ అంటున్నారు విమర్శకులు.

ముందుండి నడుపుతున్న సుమ

ఇక యాంకర్ గా సుమ చాలా షోలను ముందుండి నడిపిస్తుంది. ఆమె షోకు టీఆర్పీలు సైతం వేగం పుంజుకోవాల్సిందే. మల్లెమాల ప్రొడక్షన్ లో వచ్చిన క్యాష్ షో ఈ టీవీలో ప్రసారం అవుతుంది. ఇందులో సుమ ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మల్లెమాల వారి షోలలో ‘క్యాష్’ కూడా భారీ టీఆర్పీని సొంతం చేసుకుంటూ సాగుతుంది. సెలబ్రెటీలను గెస్ట్ లుగా పిలిచి వారితో గేమ్స్ ఆడించి డబ్బలు ఇవ్వడం ఈ షో థీమ్. దీనికి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా ఎక్కువే ఉంది.

ఫుల్ ఎంటర్ టైనర్ చేయబోనున్న వచ్చే ఎపీసోడ్

ఈ టీవీలో ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ‘క్యాష్’ షో ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించి ఒక ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. ప్రోమోలో కమేడియన్స్ ప్రభాస్ శ్రీను, హేమ, హరితేజ, ప్రవీణ్ గెస్ట్ లుగా వస్తున్నట్లు తెలుస్తుంది. వీరి అల్లరితో షోకు మరింత ఊపు వస్తుంది. ప్రభాస్ శ్రీను పంచులు షోకే హైలట్ నిలవువనున్నాయి. హేమ, హరితేజ కూడా దుమ్ము లేపినట్లు ప్రోమోను చూస్తే తెలుస్తుంది. యాంకర్ సుమ వీరితో వీరు సుమతో ఆడుకున్నారు.

పార్కులో చాలా రోజుల నుంచి చూస్తున్నా

ఇందులో ఏడిపించాలని హరితేజకు సుమ టాస్క్ ఇవ్వగా షోకి వచ్చిన వారితో ఏడిపిస్తానని చెప్పి చేయించడం, లవ్ ప్రపోజ్ సీన్ చేయాలని ప్రవీణ్ కు టాస్క్ ఇచ్చింది సుమ. దీన్ని కూడా ఆడియన్స్ లలో ఒకరితో చేయించాడు ప్రవీణ్. ఆడియన్స్ లో ఉన్న ఒకరిని పిలిచి మీరు సుమకు ప్రపోజ్ చేయాలని అంటూ తన టాస్క్ ను ప్రవీణ్ ఆడియన్స్ కు ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చిన ఒక అబ్బాయి నిన్ను పార్కులో చాలా రోజుల నుంచి చూస్తున్నా నువ్వంటే నాకు బాగా ఇష్టం అంటూ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు.

నువ్వు మా అబ్బాయి క్లాస్ మెట్

ప్రవీణ్ టాస్క్ ను చేసేందుకు వచ్చిన అబ్బాయి సుమకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. సుమ వెంటనే నువ్వు మా అబ్బాయి క్లాస్ మేట్ కదా.. అంటూ పంచ్ వేయడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది. సుమ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ కు అందరూ స్టన్ అయ్యారు. తన కొడుకు కంటే చిన్నవాడు కావడంతో సుమ ఇలా స్పందించారు. ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ తో క్యాష్ షో చాలా ఎంటర్ టైన్ మెంట్ తెచ్చిపెడతాయి. ప్రోమోనే ఇలా ఉంటే ప్రోగ్రాంపై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. కాగా సుమన్ కొడుకు హీరోగా తెరంగేట్రం ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో గుసగులసలు వినిపిస్తున్నాయి.