ఆమె లేకుంటే బాలకృష్ణ కెరీర్ నాశనం అయ్యేదా..?

0
545

ఎన్టీఆర్ నట వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు యువరత్న బాలకృష్ణ. తనకంటూ గుర్తింపు సంపాదించుకుంటూ యంగ్ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సాంఘీక, జానపద, యాక్షన్ ఇలా పాత్ర ఏదైనా తనదైన ముద్రవేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకూ సమకాలీన హీరోల్లో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదనడంలో సందేహమే లేదు. వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తూ ఇండస్ట్రీలో రికార్డులను తిరగస్తూనే ఉన్నారు.

బాలయ్య సినిమా అంటేనే రికార్డు ఖాయం అనే రేంజ్ కు ఎదిగారు. ఇప్పుడు ‘ఆహా’తో జతకట్టిన ఆయన అన్ స్టాపబుల్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక దశలో ఆయన తప్పటడుగులు వేశారనే చెప్పాలి. అప్పుడు ఆయన ఎంచుకున్న ప్రాజెక్టులు ఫ్లాపులను చవిచూశాయి. ఆయన కెరీర్ ఒక దశలో మసకబారిందనే చెప్పక తప్పదు.

కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న బాలయ్య బాబు

కొందరు అనుభవం లేని డైరెక్టర్లు, అనుభవం ఉన్నవారి కథ ఎంపికలో బాలకృష్ణ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాసిరకం మూవీస్ చేస్తూ అభిమానులకు కూడా విసుగు తెప్పించారు. ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఫ్యాన్ ఒక దశలో థియేటర్స్ లో ఆయన సినిమాలు చూడాలంటేనే విసుగు చెందేవారు. అఖండ సినిమాకు ముందు ఆయన చాలా డిజాస్టర్లను ఎదుర్కొన్నారనే చెప్పాలి. ఈ దశలోనే నందమూరి అభిమానులు కూడా చాలా విసుగెత్తిపోయారు. తమ హీరో కథల ఎంపికలో ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కూడా.

అఖండాకు ముందు అన్నీ ఫ్లాపులే

అఖండ కు ముందు బాలకృష్ణ కెరీర్ ఇక ముగిసినట్లే అంటూ టాక్ లు కూడా వినిపించాయి. ఇక అఖండ రావడంతో మళ్లీ ఊపందుకున్నారు యువరత్న. దీనికి తోడు అన్ స్టాపబుల్ కూడా తోడైంది. ఇంకేముంది ఆయన మరో సారి చక్రం తిప్పడం మొదలు పెట్టారు. గ్రేట్ డైరెక్టర్స్ తో కాంబో మొదలు పెట్టారు. ఇటీవల ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి ‘వీరసింహా రెడ్డి’ని కూడా పూర్తి చేశారు. ఇది ఇంకొన్ని రోజుల్లో (సంక్రాంతి బరి) థియేటర్లలో అలరించనుంది. దీని తర్వాత అనిల్ రావిపూడితో కలిసి సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. వీటి తర్వాత కొరటాల శివతో మరో చిత్రం కూడా ఫిక్స్ అయ్యింది.

తేజస్విని సలహాలు పాటిస్తున్న బాలకృష్ణ

కెరీర్ లో వెనుకబడి పోతున్న బాలయ్య బాబును మళ్లీ దారిలోకి తెచ్చింది ఒక అమ్మాయి అంటే సందేహమే లేదు. అదెలాగో తెలుసుకుందాం.. బాలయ్య బాబు సినిమాలు వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన చిన్న కూతురు తేజస్విని కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలను ఆయన కూడా పాటిస్తూ వస్తున్నారట. ఆహాలో వస్తున్న ‘అన్ స్టాపబుల్’కు కూడా క్రియేటివ్ హెడ్ గా తేజస్విని వ్యవహరిస్తున్నారు. ఇలా కెరీర్ మళ్లీ పుంజుకునేందుకు ఆమె ఎన్నో పథకాలు వేసిందట. తమ అభిమాన హీరోను మళ్లీ ఫామ్ లోకి తేవడంతో ఆయన ఫ్యాన్స్ తేజస్వినికి థాంక్స్ చెప్తున్నారట.