మెగా కూతురు శ్రీజ పోస్ట్ వైరల్

0
1217

మెగా కూతురు శ్రీజ ఈ మధ్య చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. రీసెంట్ గా రెండో భర్త కళ్యాణ్ దేవ్ కు కూడా విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య ఆమె పెట్టిన పోస్ట్ కూడా ఇదే చెప్తుందని వైరల్ అవుతుంది. ఈ వార్తలపై ఇప్పటి వరకూ మెగా కుటుంబం కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆమె పోస్ట్ ను చూసిన వారంతా మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

వివాదాల్లో నిలుస్తున్న శ్రీజ

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ఆది నుంచి వివాదాలతోనే జీవితాన్ని నెగ్గుకస్తుంది. మొదట ఒక బ్రాహ్మణ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ సమయంలో ఆమె కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంపై స్పందించిన చిన్నాన్న పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె కేసులు పెట్టింది. కొన్నాళ్లు తను ప్రేమించిన వ్యక్తితో కాపురం చేసిన ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

తర్వాత అత్తింటి వేధింపులు అంటూ ఆయనను విడిచిపెట్టింది. పుట్టింటికి వచ్చిన శ్రీజను అప్పటికే భార్యను విడిచిపెట్టి ఒంటరిగా ఉన్న కళ్యాణ్ దేవ్ కు ఇచ్చి వివాహం చేయించారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత కళ్యాణ్ దేవ్ ను కూడా ఆమె వదిలి వెళ్లింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీజ ఇన్ స్టాలో కళ్యాణ్ దేవ్ పేరును కూడా తొలగించింది.

అభిమానులతో పంచుకున్న మెగా డాటర్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన జీవిత విశేషాలను మెగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది ఎన్నో అనుమానాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలుస్తుంది. న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టిన ఆమె గత స్మృతులను చేతు అనుభవాలను పంచుకున్నారు. ఆమె పెట్టిన పోస్టు విషయాలను తెలుసుకుందాం..

శ్రీజ పోస్ట్

‘డియర్ – 2022 నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వారిని కలిసేలా చేశావు. నన్ను ప్రేమించేవాడు.. చాలా కేరింగ్ గా చూసుకునేవాడు.. కష్ట సుఖాలలో తోడుండే వాడు.. నన్ను అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన వ్యక్తిని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులకు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. త్వరలోనే నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలవుతుంది.’ అంటూ ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు ఆమె మూడో పెళ్లికి సిద్ధమైందా..? ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ పెట్టిందా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శ్రీజ మూడో పెళ్లికి సంబంధించి కాబోయే భర్త ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిరిస్తున్నారు.