ఆ మూవీ కోసం 12 కి. మీ. క్యూలైన్.. కలెక్షన్లలో అప్పట్లోనే రికార్డు క్రియేట్

0
1394

టాలీవుడ్ ఇండస్ర్టీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. టీలీవుడ్ లో ఎన్నో వైవిధ్య పాత్రల్లో మొదట కనిపించి వాటికి ప్రాణం పోశారు ఆయన, హిస్టరీని క్రియేట్ చేశారనడంలో సందేహం లేదు. ఆయన సినిమా అంటే చాలు ఒక డిఫరెంట్ లుక్కు ఉండాల్సిందే. మొదటి పూర్తి స్థాయి కలర్ చిత్రం ఆయన హీరోగా చేసిందే. మొదటి గూఢచారి చిత్రం తీసింది కూడా సూపర్ స్టార్ క్రిష్ణనే. ఇండస్ర్టీ మూస దోరణీలో వెళ్తున్న సమయంలో కొత్త కథతో దర్శకుల పంథాను మారుస్తూ వస్తున్నారు ఆయన.

అన్నీ తానైన కృష్ణ

ఆయన హీరోగా చేసిన చిత్రం సింహాసనం ఇప్పటి బాహుబలితో పాల్చవచ్చు కూడా. జానపద చిత్రం చేయాలని కృష్ణకు బలమైన కోరిక ఉండేది. ఆ మేరకు ఆయనే స్వయంగా కథను కూడా రాసుకున్నారు. దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తూ, నిర్మాణం కూడా ఆయన తీసుకున్నారు. ఇన్ని రంగాల్లో ఆయన కీలంగా వ్యవహించి తీసిన చిత్రం ‘సింహాసనం’. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది టాలీవుడ్ ఇండస్ర్టీలో మొదటి 70ఎంఎం సినిమా, అన్ని రంగాలను హీరో కృష్ణ తలకెత్తున్నారు. అయితే భారీ బడ్జెట్ తో తీయాలనుకున్న ఈ చిత్రానికి అప్పట్లోనే రూ. 3.50కోట్లు వెచ్చించారు.

రూ. 3.50 కోట్లతో నిర్మాణం

ఒంటరిగా అంత డబ్బలు పెడితే ఆర్థికంగా ఇబ్బందులు పడతామనుకున్న కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ కలిసి చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ భామ మందాకిని నటించగా, మరికొన్ని పాత్రల్లో జయప్రద, రాధ కూడా ఉన్నారు. రెండు నెలల్లోనే పూర్తయిన ఈ సినిమా గురించి అప్పట్లో దినపత్రికలు రోజూ వార్తలను ప్రచురించేవి. దీంతో చిత్రంపై ప్రేక్షకులు, కృష్ణ అభిమానుల్లో భారీగా పెరిగాయి. ‘సింహాసనం’ సినిమాను రూ. 3.50 కోట్లతో తెలుగుతో పాటు హిందీలో కూడా షూటింగ్ నిర్వహించారు. అయితే హిందీలో జితేంద్ర నటించారు. రెండు నెలల్లో పూర్తయిన ఈ మూవీ 21 మార్చి, 1896లో రిలీజ్ అయ్యింది.

ఎన్నో రికార్డులను బ్రేక్

వస్తూ వస్తూనే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఏకంగా 12 కి. మీ క్యూలైన్ లో వేచి ఉండేవారంటే అతిశయోక్తి కాదు. మొదటి వారం రూ. 1.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒకే థియేటర్ లో రూ. 15 లక్షలు రాబట్టింది. ఇక విశాకపట్నం లాంటి సిటీల్లో శత దినోత్సవం కూడా పూర్తి చేసుకుంది. 100 రోజుల వేడుకకు 400 బస్సుల్లో సినీ, కృష్ణ అభిమానులు తరలివచ్చారు. ఇది మరో రికార్డు. ఇలా ‘సింహాసనం’ రికార్డులను సెట్ చేసింది.