రాజకీయాల్లో ఫ్లాప్ గా నిలిచిన స్టార్ హీరోలు..!

0
269

రాజకీయాలకు, ఇండస్ట్రీకి అవినాభావ సంబంధమే ఉంది. స్టార్ డమ్ సాధించిన చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లి చక్రం తిప్పారు. మంత్రి పదువులు అనుభవిస్తున్నవారు కొందరైతే ఏకంగా రాష్ర్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న వారు మరికొందరు. అప్పట్లో తమిళనాట ఎంజీ రామచంద్రన్ డీఎంకే లో కొన్ని రోజులు పని చేశారు. తర్వాత దాని నుంచి విడిపోయి ఏఐఏడీఎంకే స్థాపించి తమిళనాడు రాజకీయాలను పూర్తిగా మార్చేశారనే చెప్పాలి. ఆ తర్వాత అదే పార్టీలో ఎదుగుతూ వచ్చారు నటి జయలలిత. ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్థాపించి పదవిలోకి తీసుకచ్చారు ఎన్టీఆర్.

ఇలా ఇండస్ట్రీకి, రాజకీయాలకు మంచి సంబంధమే ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన స్టార్లు ఎవరూ ఆ స్థాయిలో ఎదగలేకపోతున్నారు. చిరంజీవి పార్టీని స్థాపించి అదే ఎదిగే క్రమంలో కాంగ్రెస్ లో ఐక్యం చేశారు. ఇక తర్వాత రజనీకాంత్ కూడా పార్టీని స్థాపించి విడిచిపెట్టారు. ఇప్పడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి నెట్టుకస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి బోల్తా పడిన కొందరు స్టార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చిరంజీవి

కొణిదెల శివశంకర వరప్రసాద్ గా వచ్చి మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ తో పాటు చాలా చిత్ర పరిశ్రమలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్లు. ఇంత మంది అభిమానులు ఉన్న ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009లో ఎన్నికల బరిలో నిలవగా కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. ఆ తర్వాత అనతికాలంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి కేంద్రంలో కొన్ని రోజులు పదవి అనుభవించి ఆ తర్వాత రాజకీయాల్లోంచి బయటకు వచ్చారు.

కమల్ హాసన్

విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్ లో చాలా చిత్రాలు వంద రోజుల పండుగలను జరుపుకున్నాయి. ఇండియా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఎక్కువే. నటనలో ఆయనను మించిన వారు లేరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కూడా రాజకీయ ప్రవేశం చేశారు. మక్కల్ నీది మయం (ఎంఎన్ఎమ్) అనే పార్టీని స్థాపించారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ 1300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

విజయ్ కాంత్

తమిళ నాడు రాజకీయాల్లోకి నటుడు విజయ కాంత్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన కూడా సక్సెస్ కాలేకపోయారు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నా. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మాత్రం ప్రతిభ చూపలేకపోయారు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ప్రకాశ్ రాజ్

విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు ప్రకాశ్ రాజ్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా చాలా ఇండస్ట్రీలలో రాణించారు ఆయన. విలన్ గా, కో ఆర్టిస్ట్ గా, ప్రస్తుతం తండ్రిగా పలు పాత్రల్లో నటించి మెప్పించి ఎంతో మందిని ఫ్యాన్స్ చేసుకున్నారు ప్రకాశ్ రాజ్. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి బోల్తా పడ్డారు. ఆయనను నటుడిగానే చూస్తామని పాలకుడిగా చూడలేమని ఓటర్లు తేల్చి చెప్పారు.

పవన్ కళ్యాణ్

మెగాస్టార్ తమ్ముడిగానే కాకుండా మంచి ఆదరణ కలిగిన నటుడిగా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు సంపాదించుకున్నాడు. రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన 2014లో ‘జనసేన’ పార్టీని ఏర్పాటు చేశాడు. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ టీడీపీ, బీజేల వెంట నడిచారు. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు చుక్కెదురైంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాన్ రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు.