సమంత ప్లేస్ లో ఆ హీరోయిన్ ఉంటే

0
282

పరుచూరి గోపాలకృష్ణ ఇదొక పేరుగా కాకుండా ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అంటేనే తెలుస్తుంది. రాఘవేందర్ నుంచి ప్రస్తుత యంగ్ డైరెక్టర్ల వరకు మాటలు రాస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఆది కావ్యాల నుంచి పొందిన ఇన్పిరేషన్ తో వీరు రాసే సినిమా కథలు ఇండస్ట్రీలకు షేక్ చేశాయనడంతో సందేహం లేదు. పరుచూరి బ్రదర్స్ సినిమాల్లో కూడా అనేక పాత్రలు ధరించి మెప్పించారు.

సినిమాలు తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ చానల్ ఓపెన్ చేశారు పరుచూరి బ్రదర్స్. రీసెంట్ గా వస్తున్న సినిమాలపై రివ్యూలు ఇస్తూ ఫలాని సినిమాలో వారి పాత్ర, సంబంధిత చిత్ర విశేషాలను చెప్తూ మంచి రివ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా పరుచూరి బ్రదర్స్ సమంత సినిమాపై రివ్యూలో ఆసక్తి కర విషయాలను వెల్లడించారు.

యశోదపై పరుచూరి రివ్యూ

ఇప్పటికే ఇండస్ట్రీలో బిగ్ సినిమాలపై రివ్యూస్ ఇచ్చిన పరుచూరి బ్రదర్స్ ‘యశోద’పై కూడా తనదైన స్టయిల్ లో స్పందించారు. ఆ సినిమాలో ప్లస్, మైనస్ లను వివరించే ప్రయత్నం చేశారు. సమంత పాత్ర ను విశ్లేషిస్తూ ఆ పాత్రలో మరో హీరోయిన్ ఉంటే ఎలా ఉంటుందో చెప్పారు. సమంత లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన సినిమా యశోద. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం బాగానే వసూళ్లను రాబట్టింది. ఇందులో ప్రముఖంగా సమంత యాక్షన్ అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. సమంత చేసిన క్యారెక్టర్ చిత్ర కథను వివరించారు పరుచూరి బ్రదర్స్. వారు ఇచ్చిన రివ్యూ గురించి మనం పరిశీలిద్దాం..

విజయశాంతి అయితే బాగుండేది

‘గత తరం ఈ తరానికి చాలా తేడాలు ఉన్నాయి. అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. టెక్నాలజీ, ఓటీటీ లాంటి ఎన్నో అంశాలు ఇప్పటి తరానికి ప్లస్ గా మారాయి. కొత్త కొత్త యంగ్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడంతో కథల ఎంపిక కూడా మారుతూ వస్తుంది. ఇక హీరోలు, హీరోయిన్లు కూడా మంచి పర్మార్ఫెన్స్ ఇస్తూ మరింత రాణిస్తున్నారు. గుర్తింపు పొందిన పాత్రలు రావడంతో కెరీర్ తొలినాళ్లలోనే ఇండస్ట్రీలో పాతుకుపోతున్నారు. అయితే ఇటీవల సమంత లేడీ ఓరియంటెడ్ గా నటించిన ‘యశోద’మూవీ మమ్ములను బాగా అలరించింది. డిఫరెంట్ కథను ఎంచుకున్న డైరెక్టర్ బాగా ప్రజెంట్ చేశాడు కూడా. కానీ ఈ చిత్రం కథ గతంలో ఇండస్ట్రీకి దొరికి ఉంటే అప్పుడు ఈ కథతో విజయశాంతి నటించి ఉంటే వేరే లెవలే ఉండేది.

రాములమ్మ లాంటి మూవీస్

గత చిత్రాల్లో విజయశాంతి అంటే గుర్తుకు వచ్చే కర్తవ్యం, రాములమ్మ లాంటి మూవీస్ కర్తవ్యం ఆమె పాత్ర విలక్షణంగా ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. ఇప్పటి యశోదతో పోల్చుకుంటే ఆ చిత్రం బాగా ప్రజాదర్శణ పొందిందనే చెప్పాలి. లేడీ అమితాబ్ గా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది విజయశాంతి. యశోద లాంటి కథ అప్పుడు ఉండి. అందులో విజయశాంతి నటించి ఉంటే అప్పుడు ఉన్న స్టార్ హీరోల గుండెల్లో గుబులు మొదలయ్యేది, వణికిపోయేవారు కూడా.’ అంటూ చెప్పారు పరుచూరి బ్రదర్స్.

సోషల్ మీడియా కామెంట్లు

ఇక సమంత లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన మూవీ యశోద. ఈ సినిమాపై ఎన్నో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మొన్నటి ఓటీటీ రిలీజ్ వరకూ అవి కొనసాగాయి. తాజాగా పరుచురి బ్రదర్స్ మాటలతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మూవీ. ప్రస్తుతం వీరి మాటలపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. సమంత క్యారెక్టర్ లో నయనతార ఉండి ఉంటే బాగుండేదని కొందరు చెప్తుంటే.. మరికొందరు మరో హీరోయిన్ అంటూ చెప్తున్నారు. కానీ ఈ సినిమా కోసం సమంత పెట్టిన ఎఫర్ట్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అనారోగ్యంగా ఉన్నా కూడా ఆమె ఇందులో నటించిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది.