అల్లు అర్జున్ తో పెళ్లికి ఒప్పుకోని స్నేహరెడ్డి తల్లి

0
326

ఇండస్ట్రీలో యంగ్ జంటల అన్యోన్యత గురించి చెప్పుకోవాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటారు. స్నేహరెడ్డిని మొదటి చూపులోనే ఫస్ట్ సైట్ లవ్ కలిగిన ఆయన పెళ్లి వరకూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారనే చెప్పాలి తన తండ్రి ఒప్పుకున్నా.. స్నేహారెడ్డి తల్లి మాత్రం నో చెప్పిందట. ఇక అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

స్నేహరెడ్డి గురించి

చంద్రశేఖర్ రెడ్డి-కవితకు 1985లో జన్మించింది స్నేహారెడ్డి. ఆమె మొదటి నుంచి చదువులో టాపర్. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న ఆమె ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ల నాన్న స్థాపించిన సెయింట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొంత కాలం పని చేసింది. ఆమెకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ మాత్రమే చూసేవారు. ఇక తెలుగులో అయితే చిరంజీవి, వెంకటేశ్ చిత్రాలను ఎక్కువ ఇష్టంగా చూసేవారు. స్నేహారెడ్డిని 2010లో కలిశాడు బన్నీ.

పెళ్లిలో కలిసిన అల్లు అర్జున్-స్నేహారెడ్డి

2010లో తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లింది స్నేహారెడ్డి. అదే పెళ్లికి అల్లు అర్జున్ కూడా వెళ్లాడు. అక్కడ అల్లు వారబ్బాయి స్నేహారెడ్డిని చూశారు. తొలిచూపులోనే వరించాడు. ఆమెతో మాటలు కలిపాడు. అక్కడికి ఎంతో మంది వచ్చినా స్నేహారెడ్డి పైనే అల్లు అర్జున్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపాడు. ఆమె మాటతీరు, నడవడి, ప్రవర్తన ఆయనను బాగా ఆకట్టుకున్నాయి.

దీంతో తను ఆమెనే పెళ్లి చేసుకుంటానని తన తండ్రి అల్లు అరవింద్ కు చెప్పాడు బన్నీ. ఈ విషయంలో అరవింద్ కూడా ఒకే చెప్పాడు. పెళ్లి ఆయన సొంత విషయం కాబట్టి నో చెప్పలేకపోయాడు. పైగా స్నేహారెడ్డి విషయంలో కూడా నో చెప్పేందుకు ఎలాంటి కారణం కనిపించలేదు. ఇక అర్జున్ కు కాబోయే భార్య కుటుంబం గురించి ఆరా తీశారు అన్న అల్లు వెంకటేశ్.

రంగంలోకి దిగిన చిరంజీవి

అందరూ ఒకే అన్న తర్వాత స్నేహారెడ్డికి ప్రపోజ్ చేశారంట అల్లు అర్జున్. ఆయన ఎప్పుడెప్పుడు చెప్తాడా అని ఎదురు చూసిన స్నేహారెడ్డి కూడా ఒకే చెప్పిందట. ఇక పెళ్లి చేసేందుకు రంగంలోకి దిగారు చిరంజీవి, అల్లు అరవింద్. ఇద్దరూ స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి మాట్లాడారు. కూతురు ఇష్టాన్ని తెలుసుకున్న ఆయన కూడా ఒకే అన్నారు. కానీ స్నేహారెడ్డి తల్లి కవిత మాత్రం ససేమీరా అందట. సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తితో తన కూతురు వివాహం చేయనని, స్టార్ హీరోగా క్రేజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ హీరోయిన్ వెంటబడతారో తెలియదు కాబట్టి అని పలు విధాలుగా ఆలోచించిందట. పైగా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి వద్దని చెప్పిందట.

తల్లిని ఒప్పంచిన స్నేహారెడ్డి

కానీ బన్నీతో లవ్ లో ఉన్న స్నేహారెడ్డి తల్లిని ఒప్పంచిందట. ఇండస్ట్రీలో ఉన్న వారందరూ ఒకేలా ఉండరని చెప్పిందట. ఇప్పటికీ కొందరు అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అందరినీ ఒకే దృష్టితో చూడొద్దని బన్నీ మంచి వ్యక్తి అని తల్లిని మెప్పించిందట. దీంతో ఆమె కన్వీన్స్ అయి ఒకే చెప్పింది. ఇక 7 మార్చి, 2011లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి పెళ్లి పీటలు ఎక్కారు. ఇప్పటి వరకూ కూడా వారు అన్యోన్యంగా ఉన్నారు. స్నేహ కూడా భర్తకు అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తూ, కుటుంబ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిస్తుంది.