‘తల్లి కాబోతున్న ఛార్మి’.. నిర్ణయానికి అందరూ షాక్

0
368

సినీనటి ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యంగ్ హీరోయిన్స్ కు ఇన్పిరేషన్ గా ఉంటూ చాలా సినిమాలు తీశారు ఆమె. ఆమె ఇటీవల నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. కెరీర్ ప్రారంభంలో ఫుల్ గ్లామర్ రోల్స్ లో నటించిన ఛార్మి. బాపుగారి బొమ్మగా కూడా మారిపోయారు. చూడ చక్కని రూపం ఆమె సొంతమనే చెప్పాలి. కృష్ణవంశీ తీసిన శ్రీ ఆంజనేయంలో ఒక సాంగ్ లో ఆమె చూపించిన గ్లామర్ స్టార్ హీరోలకు కూడా చెమటలు పుట్టిచ్చిందంటే ఆమె అందం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

బాపు బొమ్మగా కూడా గుర్తింపు

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున ఇలా చాలా మందితో ఆమె చాలా చిత్రాల్లో నటించారు. యంగ్ హీరోల సినిమాల్లో కనిపించిన ఆమె సెకండ్ హీరోయిన్ గా కూడా అలరించారు. క్యారెక్టర్ ఏదైనా ఒదిగిపోయేవారు ఛార్మి. ఇక బాపు గారి సెలక్షన్ ఏ మేరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాపు మరణానికి ముందు ఛార్మితో కలిసి ఒక చిత్రం తీశారు. అప్పటి నుంచి ఆమె బాపు బొమ్మగా కూడా మారిపోయారు.

వీటితో పాటు హారర్ చిత్రాల్లో కూడా భయపెట్టారు ఛార్మి. శివాజి తో కలిసి మంత్ర సినిమాలో నటించిన ఆమె భయపెట్టారనే చెప్పాలి. ఇక జ్యోతిలక్ష్మి విషయానికి వస్తే అందులో ఆమె వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపే తెచ్చిపెట్టిందని చెప్పాలి.

బిజీగా ఉన్న కెరీర్ కు బ్రేక్

అప్పట్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు ఛార్మి. జ్యోతిలక్ష్మి పాత్ర తర్వాత ఒక డైరెక్టర్ చెప్పడంతో ఐటం సాంగ్ లో నటించారు ఛార్మి. ఇక తర్వాత వచ్చే దర్శకులు, నిర్మాతలు ఆమెకు ఐటం సాంగ్ ఇచ్చేందుకే ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. హీరోయిన్ గా ఆమెకు ఏ దర్శకుడు అవకాశం ఇవ్వలేదు సరికదా.. ఐటం సాంగ్ చేస్తే చెయ్ లేదంటే మానెయ్ అంటూ కూడా చెప్పేవారని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అప్పుల్లో కూరుకుపోయిన స్టార్ నటి

ఐటం గర్ల్ గా మారిన ఛార్మికి అవకాశాలు తగ్గుతుండడంతో ప్రొడ్యూసర్ గా మారాలని అనుకుంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ‘పూరి కనెక్ట్’ అనే బ్యానర్ కింద సినిమాలు చేయడం ప్రారంభించింది. ఇందులో రెండు సినిమాలు చేయగా ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి.. మరొకటి డిజాస్టర్ గా మిగిలింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ కాగా లైగర్ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఛార్మి ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు ఈడీ ప్రశ్నలతో సతమతం అవుతుంది.

తల్లి పాత్రలు చేస్తానంటున్న ఛార్మి

అప్పుల్లో నుంచి బయటపడేందుకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఛార్మి భావిస్తుందట. ఈ వార్తలు ఇప్పుడ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తల్లి, అత్త, ఇలా ఎలాంటి పాత్రల్లో నైనా చేసేందుకు ముందుకు వస్తుందట ఛార్మి కౌర్. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ కావడంతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ కనీసం పెళ్లి చేసుకోకుండానే మదర్ క్యారెక్టర్ కు పడిపోయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై ఛార్మి సైతం స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.