భర్తను మోసం చేసిన విజయలక్ష్మి..!

0
428

కోలీవుడ్ జంట రవీందర్-మహాలక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు అనుకుంటా. బొద్దుగా ఉండే రవీందర్ ను ముద్దుగా ఉండే విజయలక్ష్మి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అప్పట్లో మహాలక్ష్మిపై సోషల్ మీడియాలో చాలా గాసిప్ లు వైరల్ గా మారాయి. ఆస్తి కోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుందని.. ఇలా కానీ అవేవీ కావని రవీందర్ అంటే నా మనసుకు దగ్గరున్న వ్యక్తి అనిపించిందని అందుకే పెళ్లి చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది విజయలక్ష్మి.

విమర్శకుల నోళ్లు మూయిస్తున్న జంట

ఇక ఈ జంట ప్రతీ విషయాన్ని తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. తమ జీవితంలో జరుగుతున్న మెమోరబుల్, షాకింగ్ మూమెంట్స్ అంటూ ప్రతీ చిన్న విషయం పంచుకుంటుంటారు. విమర్శించిన్న వారంతా వారి దాంపత్యాన్ని చూసి ప్రస్తుతం మురిపిపోతున్నారనే చెప్పాలి. ఒకరి కొకరు తోడుంటూ ఎలా జీవించాలో కూడా వీరు చెప్తుండడంతో విమర్శకుల నోళ్లు మూసుకున్నారడంలో సందేహం లేదు. ఈ జంట ఎప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది. వీరికి వివాహం జరిగి వంద రోజులు పూర్తవడంతో భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు.

భారీగా 100 డేస్ ప్లాన్స్

పెళ్లయి వంద రోజులు గడువడం.. డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించుకునేలా వేడుకలు నిర్వహించున్నారట. ఈ సెలబ్రేషన్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది జంట. గతంలో రవీందర్ తన భార్య మహాలక్ష్మి కోసం ఓ గిఫ్ట్ ఇవ్వగా ఇప్పుడు మహాలక్ష్మి వంతు వచ్చింది. దీని కోసం భారీగానే ప్లాన్ చేశారట. న్యూ ఇయర్ కూడా కలిసి వస్తుండడంతో దీనికి కూడా సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారట. కానీ రవీందర్ ఆ ప్లాన్ నుంచి తప్పించుకొని తిరిగి ఆమెకే సర్ ప్రైజ్ ఇచ్చారట. అదెలాగో చూద్దాం..

పోస్ట్ లో హాలిడే టిక్కట్లు.. అవాక్కయిన మహాలక్ష్మి

మహాలక్ష్మి రవీందర్ ను సర్ ప్రైజ్ చేయాలని అనుకుంది. ఆయనను డైరెక్టుగా వేడుకలకు ఆహ్వానించకుండా వెరైటీగా ప్లాన్ చేయాలని అనుకుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆమె ఈ ఏర్పాట్లలో బిజీగా ఉండగా ఆమెకు హాలిడే ట్రిప్ కు సంబంధించిన టికెట్లు పోస్ట్ లో వచ్చాయి. దీంతో ఆమె షాక్ కు గురైందట. తాను సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే కనీసం ఊహలకు అందకుండా రవీందర్ ప్లాన్ చేశారట. రవీందర్ మహాలక్ష్మిని సర్ ప్రైజ్ చేయాలని భావించి కొన్ని రోజుల క్రితం ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించి టికెట్లు కూడా బుక్ చేశాడు.

అయితే ఈ టికెట్లు పోస్ట్ లో తన ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. ఇక పోస్ట్ లో వచ్చిన టికెట్లను చూసిన మహాలక్ష్మి తను సర్ ప్రైజ్ కు ప్లాన్ చేస్తుంటే రవీందర్ దానికి రెండింతల సర్ ప్రైజ్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వారి అన్యూన్యతను చూసి సంబురపడుతున్నారు. ఇలాగే సంతోషంగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.