ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా రికార్డు

0
252

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో సమంత దూసుకుపోతోంది. వయోసైటిస్ తో బాధపడుతున్నా ‘యశోద’తో పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్ గా ఘనత సాధించింది. ఈ కోవలోనే మరో రికార్డు సొంతం చేసుకుంది సామ్. ఇటీవల ఓ సంస్థ ‘ఇండియాస్ మోస్ట్ పాపులర్ హీరోయిన్స్’ ఎవరు అంటూ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో మొదటి స్థానం కైవసం చేసుకుంది సమంత. ఇటీవల హీరోలపై సర్వే చేసిన ‘ఓరామాక్స్’ ఇప్పుడు హీరోయిన్లపై దృష్టి పెట్టింది. తాజాగా తమ సర్వే నివేధికలను విడుదల చేసింది.

హీరోయిన్లలో సమంత ఫస్ట్ ప్లేస్

హీరోల్లో ప్రభాస్ మొదటి వరుసలో నిలవగా హీరోయిన్లలో సమంత ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఇటీవల ఈ సంస్థ ఇండియా వైజ్ గా మోస్ట్ పాపులర్ ఫిమేట్ స్టార్ లిస్టును ప్రకటించింది. ఇందులో సామ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడంతో ఫ్యాన్స్ అభినందనలు గుప్పిస్తున్నారు. ఆమె తర్వాతి స్థానంలో ఆలియా భట్, మూడో స్థానంలో నయనతార, నాలుగో స్థానంలో కాగల్ అగర్వాల్ నిలిచారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఐదో స్థానంలో, రష్మికా మందన ఆరో స్థానంలో ఉండగా, ఏడో బెర్త్ ను కత్రినా కైఫ్ కు దక్కింది. ఈ సారి కూడా అనుష్క శెట్టి టాప్ టెన్ లో నిలవడం విశేషం.

బాక్సాఫీస్ వద్ద మంచి హిట్

తనకు ఫస్ట్ ప్లేస్ రావడంపై సంతోషం వ్యక్తం చేసినా తనకు వచ్చిన వ్యాధి గురించి బయటపెట్టింది సమంత. తను ఈ వ్యాధితో పడుతున్న బాధల గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది సమంత. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యశోద’తో ప్రేక్షకులను అలరించిన సమ్. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ఇచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా ఇది మంచి హిట్ అంటూ టాలీవుడ్ వర్గాలు పేర్కొటుండగా ఈ మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ ను తన ఖాతాలో వేసుకుంది. పూర్తి లేడీ ఓరియంటెడ్ గా సాగిన ‘యశోద’ హిందీ, తమిళం, తదితర భాషల ప్రేక్షకులను అలరిస్తుంది.

మొదటి సారి పౌరాణిక పాత్రలో

మూవీ రిలీజ్ దాదాపు రెండు వారాలకు పైగానే కావస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కలెక్షన్ల వసూలు చేస్తూనే ఉంది. సమంత తర్వాత మూవీ గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’. ఇది ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రంలో తన కెరీర్ లోనే మొదటి సారి పౌరాణిక పాత్రలో ఆకట్టుకోనుందట అమ్మడు. ఇది కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. త్వరలోనే థియేటికల్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మూవీలో సమంత పాత్ర గురించి ఇప్పటి వరకూ ఎలాంటి లీకులు వెలువడలేదు. అయినా తన కెరీర్ లో ఇదో అద్భుత చిత్రంగా నిలుస్తుంది అంటుంది సామ్.

రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్

ఇప్పటి వరకూ సోషల్ చిత్రాలతోనే మెప్పించానని, దీంతో పౌరాణికంగా కూడా రాణిస్తానని చెప్పింది సమంత. దీని విడుదల కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామని గుణ శేఖర్ కూడా సినీ వర్గాలకు వివరించారు. ఇక ‘యశోద’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఓరామక్స్ సర్వే మరింత ఆనందాన్ని ఇచ్చింది. తమ అభిమాన నటి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడంపై తబ్బిబ్బవవుతున్నారు.