పారితోషికం పెంచిన మీనా.. ఇప్పుడు ఎంతంటే..?

0
1211

బాల నటిగా వెండితెరపై అడుగుపెట్టిన మీనా హీరోయిన్ గా ఎన్ని రికార్డులు సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచి ఆమె వేసిన పాత్రలు భిన్నంగా ఉన్నాయి. చూడచక్కని రూపం మీనది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా మీనా, ఏ పాత్రలో అయినా ఒదిగి ఆ పాత్రకే వన్నె తెచ్చేది మీన. ఇండస్ట్రీతో సంబంధం లేని ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకున్నారు మీన. ఆ తర్వాత సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఒక కూతురు జన్మనిచ్చింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలోకి కొవిడ్ తీవ్ర విషాదాన్ని తెచ్చింది.

భర్త మరణంతో విషాదంలోకి

మీన భర్త విద్యాసాగర్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆయన ఇటీవల పోస్ట్ కొవిడ్ తో మరణించారు. దీంతో ఆమె జీవితం అగాధంలోకి వెళ్లింది. కూతురుతో నెట్టుకస్తున్న ఆమెను రెండో పెళ్లి వివాదం కొన్ని రోజులు పీడించింది. మీన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వైరల్ రాయుళ్లు సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వారిపై తీవ్రంగా స్పందించింది. అలాంటిది ఏదీ లేదని అవన్నీ గాసిప్ లు మాత్రమే అని చెప్పింది. అలాంటి విషయం ఏదైనా ఉంటే ముందే చెప్తానని, రెండో పెళ్లి ఆలోచన ప్రస్తుతం లేదని క్లారిటీ ఇచ్చింది.

సెకండ్స్ ఇన్నింగ్స్ లో మీన బిజీ

భర్త మరణం తర్వాత ఆ విషాదం నుంచి బయట పడేందుకు, కూతురు జీవితం గురించి ఆలోచించని మీన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వెండితెరపై మళ్లీ రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల బుల్లి తెరపై కొన్ని షోలలో అలరించింది కూడా. ఇక వెండితెరపై కొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ భారం తదితర కారణాలతో ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచారట. ఆమెకు ప్రస్తుతం 46 సంవత్సరాలు అయినా ఆమెకు క్రేజ్ మాత్రం అలాగే కొనసాగుతుంది. దీనికి నిదర్శనమే ‘దృశ్యం’. ఈ సినిమాలో వెంకటేశ్ కు ధీటుగా నటించారు మీన.

రూ. 20 లక్షలకు పైగానే

సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె పర్ఫార్మెన్స్ తగ్గలేదనే చెప్పాలి. కానీ వయస్సు దృశ్యా తల్లి, అత్త, వదిన తదితర పాత్రలే చేయాల్సి వస్తుంది. అయినా పారితోషికం విషయంలో తగ్గడం లేదట. ఆమె ఒక్కో చిత్రానికి రూ. 20 లక్షలకు పైగానే ఆశిస్తున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పాలి. కానీ కూతురితో ఉంటున్న ఒంటరి మహిళగా జీవితాన్ని నెట్టుకస్తున్న ఆమె ఈ మేర రెమ్యునరేషన్ తీసుకోవడం సబబే అంటున్నరు నెటిజన్లు.

గతంలో మీనకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమెకు ప్రతి దశలోనూ వారు వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నారనే చెప్పాలి.