‘మెగా’ వారసుడు(రాలి) పేరు ఖరారు.. ఇదే అంటూ నెట్టింట వైరల్

0
1426

దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత మెగా ఫ్యాన్స్ మరో సారి పండుగ చేసేకునే రోజు ఎంతో కాలం లేదు. పదేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్, నెటిజన్లు, ఇండస్ర్టీ రామ్ చరణ్ వారసుడెక్కడా..? అనే ప్రశ్నకు ఇప్పటికే ఫుల్ స్టాప్ పడింది. కొన్ని రోజుల కింద చిరంజీవి ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని అనౌన్స్ కూడా చేశారు. తమ సమకాలీకులకు వారసులు ఉన్న వేళ తన ఇంట్లో కూడా వారసులు ఉండాలని చిరంజీవి, వియ్యంకుల వారి ఒత్తిడితో రామ్ చరణ్-ఉపాసన పిల్లలకు జన్మనివ్వాలనుకున్నారట. ఈ నేపథ్యంలో వారి కోరిక ఫలించి ఉపాసన ఇప్పుడు గర్భవతిగా ఉన్నట్లు ‘మెగా’ ఫ్యామిలీ నుంచి అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది.

చిరంజీవి ట్వీట్ తో ‘మెగా’ సందడి

తను తాత కాబోతుండడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి ఆనందంగా ట్వీట్ చేశారు. తాత మీసాలతో ఆడుకునేందుకు ఓ బుల్లి రాంచరణ్ వస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలి పోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్లు సైతం రామ్ చరణ్ కు ఫోన్ లో కంగ్రాట్స్ చెప్తున్నారట. ఇక మెగా ఇంటికి రాబోతున్న బుల్లి తార కు పేరు కూడా కన్ఫమ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అబ్బాయి అయితే ఈ పేరు ఉండబోతోంది.. అమ్మాయి అయితే ఈ పేరు ఉండబోతోంది అంటూ పుట్టబోయే బిడ్డకు పేరును కూడా సూచిస్తున్నారట మెగా ఫ్యాన్స్. వారి ట్రోల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ చిరంజీవి ఏ పేరు పెడుతారు. పేరు ఎలా ఉండబోతోంది అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

హనుమంతుడి భక్తుడు చిరంజీవి

చిరంజీవికి భక్తి భావాలు ఎక్కువ. తన కెరీర్ లో ఆ భగవంతుడు ఎప్పుడూ తోడే ఉన్నాడంటూ ఆయన ఎప్పుడూ చెప్పుకచ్చేవారు. ముఖ్యంగా హనుమాన్ భక్తుడు చిరంజీవి. ఆయన హనుమాన్ ను పూజించడం ఆయన తండ్రుల నుంచి వస్తుందట. అందుకే ఆయన పేరు చిరంజీవి, తమ్ముళ్ల పేర్లు కూడా దాదాపుగా హనుమంతుడి జన్మనామంగా పెట్టారు. పవన్ కళ్యాణ్ కు ముందు పేరుకూడా ‘పవనసుతు హనుమంతుడు’ కాబట్టి అలా పెట్టారట.

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలోకి రాబోయే వారికి కూడా హనుమంతుడి పేరు కలిసేలా నామకరణం చేయబోతున్నారంటూ వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చివరన ‘తేజ్’ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు పేర్లకు మెగా ఫ్యామిలీ కూడా ఒకే..!

రామ్ చరణ్-ఉపాసనకు కొడుకు పుడితే చిరంజీవి తన మనుమడికి కూడా చివరలో తేజ్ ఉండేలా చూస్తారని నెటిజన్లు, ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. రామ్ చరణ్ కు కొడుకు పుడితే ‘అంజన్ తేజ్’ అని పెడతారని, ఒక వేళ కూతురు పుడితే ‘అంజలి’ అని పెట్టే అవకాశాలు ఉన్నాయని వైరల్ అవుతోంది. ‘అంజని పుత్రుడు హనుమంతుడు కాబట్టి’ ఈ పేర్లకు కూడా ఉపాసన దంపతులు ఓకే చెప్తున్నట్లు తెలుస్తోంది.