ఎందుకు సార్.. ఇలాంటి సినిమాలు తీస్తారు?

0
2579

టాలీవుడ్ లో అందరి హీరో ఫాన్స్ ఒక ఎత్తు అయితే.. పవన్ ఫాన్స్ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఒక ఊపు, ఉత్సహం వస్తాయి. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తారు. సినిమా విడుదలకు ముందు ఒక ట్రయిలర్ వచ్చినా అందులో పవన్ ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఒక పాట విడుదల అయితే పండగ వాతావరణం వస్తుంది.

ప్రతి సారి అభిమానులకు నిరాశే

ఈ విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని పవన్ తో సినిమా తీసే దర్శకుడు సినిమా తీస్తాడు. అయితే ఎక్కడ లోపం జరుగుతుందో గానీ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రతి సారి అభిమానులను నిరాశ పరుస్తున్నారు దర్శకులు. గత కొంత కాలంగా ఇదే జరుగుతున్నా.. పవన్ క్రెజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు

ఇందులోనూ అదే తప్పు చేసాడు దర్శకుడు. సినిమాకి అసలు ఒక లాజిక్ లేకుండా, పిచ్చరైజషన్ లేకుండా తెరకు ఎక్కించాడు. అసలు సినిమా లో ఎక్కడా కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది తెప్పించలేక పోయాడు. ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియక ప్రేక్షకులు తికమక పడుతున్నారు. కనీసం ఒక్క సీన్ బాగుంది అనేది కూడా అనిపించలేక పోయాడు.

ఆ రెండు నిమిషాలు కొంచం కామెడీ

క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఉన్న రెండు నిమిషాలు కొంచం కామెడీ అనిపిస్తుంది. అంత మించి ఎక్కడా కూడా సినిమాపై ఆసక్తి తెప్పించలేక పోయాడు దర్శకుడు. రీమేక్ తీసినా అది తెలుగు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయలేదు. బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు హిందీలో అద్భుతాలు చేశాయి. ఈ సమయంలో పవన్ సినిమా హిందీ లో విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి.