మరింత క్షీణించిన సమంత ఆరోగ్యం.. శాశ్వతంగా ‘గుడ్ బై?

0
833

సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత..తొలి సినిమా ‘ఏం మాయ చేసావే’ తోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న సమంత కి వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది..అలా తెలుగు మరియు తమిళం లో ఒక్క ప్రభాస్ తో మినహా మిగిలిన స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పర్చుకుంది.

హీరోలకు ఏ మాత్రం తీసిపోను

కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా పాత్ర నచ్చితే విలన్ రోల్స్ కూడా చెయ్యడానికి వెనకాడని ఏకైక హీరోయిన్ గా సమంత నిలిచింది..అలా తన విలక్షణమైన నటన తో సమంత హీరోలకు ఏ మాత్రం తీసిపోను అనే రేంజ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగింది..రీసెంట్ గా ఆమె నటించిన ‘యశోద’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

సినిమాలకు పూర్తి దూరం అవ్వాలనే

అయితే సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధికి గురైంది..ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుంది..అయితే ఆమె ఆరోగ్యం ఇప్పటికి ఏమాత్రం కుదుటపడకపోగా మరింత క్షీణించిందట..దీనితో ఆమె సినిమాలకు పూర్తి దూరం అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది..ప్రస్తుతం ఆమె నటిస్తున్న శాకుంతలం అనే సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఎలా అయినా పూర్తి చేసి

ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి ఆమె నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది..వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో ఆమె సగానికి పైగా పూర్తి చేసింది..బ్యాలన్స్ ఉన్న ఈ సినిమాలన్నీ ఎలా అయినా పూర్తి చేసి ఇక సినిమాలకు దూరం అవ్వాలనే ఆలోచన కి వచ్చినట్టు తెలుస్తుంది..ఆమె ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని..మళ్ళీ ఎప్పటిలాగానే సంతోషం గా జీవించాలని అభిమానులు ప్రార్థన చేస్తున్నారు.