రియల్ హీరోని జోకర్ చేసేస్తారా? పూరి ఆలోచన దారుణం

0
2053

గత కొన్నాళ్లుగా హిట్ లు కొట్టడంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విఫలం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ దేవర కొండ హీరోగా తన దర్శకత్వంలో విడుదల అయిన సినిమా లైగర్. ఈ సినిమా తొలి రోజు నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. అసలు సినిమా లో కథ అనేది లేకపోవడం పెద్ద మైనస్. ఎదో సీరియల్ లాగా నడుస్తూ.. ఎక్కడ మలుపులు లేకుండా సదా సీదాగా సాగుతుంది. దీనితో ప్రేక్షకుడు ఈ సినిమాని మెచ్చడం లేదు.

ఈ సినిమా పూరి తీసాడా

ఇక ఇందులో మరో విషయం ఏమిటంటే.. రియల్ బాహుబలి మైక్‌ టైసన్‌ చేత కామెడీ చేయించడం. సాధారణంగా మైక్‌ టైసన్‌ లాంటి భారీ విగ్రహం కళ్ల ముందు కనిపిస్తే ప్రత్యర్థి కి హడల్ పుట్టాల్సిందే. అలాంటి బాహుబలి చేత కామెడీ చేయిండం పూరి పై విమర్శలు గుప్పిస్తున్నారు సినీ అభిమానులు. అసలు ఈ సినిమా పూరి జగన్నాధ్ తీసాడంటే చాలా మందికి నమ్మ సఖ్యం కావడంలేదు. ఏది ఏమైనా మైక్‌ టైసన్‌ తెలుగులో నటించిన చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.