ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్విట్

0
2658

సరిగ్గా ఐదేళ్ల క్రితం అర్జున్ రెడ్డి విడుదల సమయంలో ఓ వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 2017 లో అర్జున్ రెడ్డి విడుదల సమయంలో యాంకర్ అనసూయ, హీరో అర్జున్ రెడ్డి ల ఓ పదం అగ్గిరాజేసింది. ఆ సినిమా ట్రైలర్ లో ఓ పదం ఇద్దరి మధ్య గ్యాప్ ని పెంచింది. ఆ పదాన్ని పట్టుకొని అనసూయ మీడియాకి ఎక్కి నానా రచ్చ చేసింది. ఆ సినిమా విడుదల సమయంలో నెలకొన్న వివాదం తో ఆ సినిమాకి బాగా పబ్లిసిటీ వచ్చింది కూడా.

కర్మ రావటం మాత్రం పక్కా

అయితే ఈ విషయాన్ని అనసూయ చాలా పెర్సనల్ గా తీసుకున్నట్టు ఉంది. ఎందుకంటే.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు ‘లైగర్’ విడుదల అయ్యాక కూడా అనసూయ ఇండైరెక్ట్ గా స్పందించింది. సినిమా కి నెగిటివ్ టాక్ రాగానే అనసూయ వెంటనే స్పందించింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదని ట్విట్ చేసింది. అంతే కాదు.. “కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.