‘జల్సా’ దరిదాపుల్లోకి రాని ‘బాబా’.. ఇంతకీ ఏమైందంటే..?

0
391

ప్రస్తుతం రీ రిలీజ్ యుగం నడుస్తోంది. స్ర్టయిట్ రిలీజ్ లో ఆడని సినిమాలను ఫ్యాన్స్ అభిమాన హీరో కోసం స్పెషల్ షోలు వేయించుకుంటున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీలు ‘జల్సా’లో ప్రారంభమయ్యయి. జల్సా సినిమా కూడా రిలీజ్ లో సరిగా ఆడక డిజాస్టర్ గా మిగిలింది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ఇదొక మంచి సినిమా అని ఇది ఎందుకు ఆడలేదో పరిశీలిస్తామని చెప్పారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదే సినిమాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాక్సాఫీస్ హిట్ ఇచ్చారు.

రీ రిలీజ్ ల పర్వం

టాలీవుడ్ రీ రిలీజ్ లో తర్వాత విడుదలైంది మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’. ఈ సినిమా రీలీజ్ సమయంలో కూడా బాక్సాఫీస్ హిట్లను తిరగరాసింది. అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయించుకున్నారు. అప్పుడు కూడా మంచి హిట్టే ఇచ్చింది. కానీ జల్సా వసూళ్లను వద్దకు మాత్రం రాలేకపోయింది.

డిజాస్టర్ మూవీని రీ రిలీజ్ చేసిన రజనీకాంత్

ఇక రజనీ కాంత్ కలల ప్రాజెక్టు ‘బాబా’. ఆయన స్వీయ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఆకట్టుకోలేక పోయింది. దీనిపై బాగా తర్జన భర్జన అయిన రజనీకాంత్ ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నాడు. అందులోని కొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేసి తుది రూపు తీసుకచ్చాడు. ‘బాబా’ ఆయన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా డిసెంబర్ 10న రిలీజైంది. చాలా థియేటర్లలో బాబా షోలు వేశారు. ఒక్క చెన్నై పట్టణంలోనే 100 షోలు నడిపించారు. అయినా ఆ సినిమా ఎక్కువ కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

జల్సాకు దూరంగా బాబా

జిల్సా రీ రిలీజ్ సమయంలో ఓవర్ ఇండియా వైడ్ గా దాదాపు రూ. 3.30 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన పోకిరీ కూడా దాదాపు రూ. 1.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే బాబా మాత్రం వాటి దరిదాపుల్లోకి రాలేదు. బాబా రీ రిలీజైన డిసెంబర్ 10 వ తేదీ నుంచి ఇప్పటి వరకూ కేవలం 93 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇంత పెద్ద ఎత్తున రీలీజ్ అయిన ఈ సినిమా రెండో సారి కూడా రజనీకాంత్ ను నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇంకో వారం ఆడినా కూడా అంత కలెక్ట్ చేయకపోవచ్చని సినీ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘జైలర్’లో రజనీ కాంత్ బిజీ

బాబా కర్ణాటకలో 8 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 లక్షలు, ఇండియా వైడ్ గా చూసుకుంటే 93 లక్షలు మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసింది. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్’ షూటింగ్ లో ఉన్నారు. నిన్న ఆయన బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ జైలర్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుధ్ సంచలనమే సృష్టించగా, టీజర్ వ్యూవ్స్ లో దూసుకుపోయింది.