‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’

0
245

ఇప్పటి వరకు అపజయమెరుగని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా పేరొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం ఇండియాలో ఐదు చిత్రాలు పోటీపడ్డాయి. ఇందులో చివరకు జక్కన్న తీసిన ‘ఆర్ఆర్ఆర్’ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య తన బ్యానర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వెయ్యి కోట్లకు పైగా

తెలుగు చిత్ర పరిశ్రమ పవరేంటో చూపిన మూవీ ఆర్ఆర్ఆర్. పీరియాడికల్ డ్రామాగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కలెక్షన్ల వసూళ్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టింది. క్లోజింగ్ బిజినెస్‌ రూ. 1,119 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా న్యూయార్క్ క్రిటిక్స్ నుంచి బెస్ట్ డైరెక్టర్‌ కేటగిరీలో టాప్‌లో నిలిచింది.

బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలోనూ సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డు కూడా సాధించింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజుకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకొని కల్పిత కథగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ లో భారీ కాంపౌండ్ లు ఐన నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు స్ర్కీన్ షేర్ చేసుకున్నారు.

ఆస్కార్ నామినేషన్ కోసం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొంటున్నది. ఆస్కార్ నామినేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఇండిపెండెంటెడ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను దక్కించుకొనేందుకు ‘ఆర్ఆర్ఆర్’ ప్రయత్నాలు చేస్తున్నది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్‌ను కూడా సాధించింది.

ఐదింటిని అధిగమించి

‘గోల్డెన్ గ్లోబ్-2022’ అవార్డుల నామినేషన్ కోసం భారతదేశం నుంచి ఐదు చిత్రాలు బరిలో నిలిచాయి. వాటిలో భారీ పోటీ ఇచ్చిన వాటిలో ఆలియా భట్ ‘గంగుభాయ్: కతియావాడి’, రిషబ్ శెట్టి ‘కాంతారా’, ఛెల్లో షో సినిమాలు ఉన్నాయి. ఛెల్లో షో ఆస్కార్ నామినేషన్‌లో ఇప్పటికే చోటు దక్కించుకున్నది.

రెండు కేటగిరీల్లో

బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాగ్వేంజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట నామినేట్ అయింది. భారతదేశం తరఫున ఎన్నికైన ఏకైక చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఘనతను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు పాటకుఎంతటి స్పందన వచ్చిందో తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం నామినేట్ అయినట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ది క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, అర్జంటీనా1985, క్లోజ్, డిసిషన్ టు లీవ్ సినిమాలతోపాటు ఆర్ఆర్ఆర్ చిత్రం పోటీలో నిలిచినట్లు వెల్లడించింది.

అవార్డుల ప్రధానం ఎప్పుడంటే?

హాలీవుడ్ ఫారీన్ ప్రెస్ అసోసియేషన్‌ ది గ్లోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ల ప్రధానోత్సవాన్ని నిర్వహిస్తున్నది. వర్ణ వివక్ష, లైంగిక వేధింపులు, తదితర ఆరోపణల కారణంగా టామ్ క్రూయిజ్‌తో కూడిన హాలీవుడ్ నటులతోపాటు ఎన్‌బీసీ ఈ అవార్డుల కార్యక్రమాన్ని గతంలో బహిష్కరించాయి. జనవరి 10 నుంచి 11 తేదీ వరకు ఈ అవార్డుల కార్యక్రమం కొనసాగనుంది. ఈ వేడుకలకు హోస్ట్‌గా కమెడియన్ జెర్రోడ్ కార్మిచెల్ వ్యవహరించనున్నారు.