‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా..!

0
336

విభిన్నమైన నటుడు ‘అల్లరి నరేశ్’ టాప్ డైరెక్టర్ కుటుంబం నుంచి వచ్చిన నరేశ్ మొదటి చిత్రం అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెండితెరపై రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ స్టార్ గా ముద్ర వేసుకున్నాడు. అప్పుడప్పుడూ సీరియస్ ప్రేమ కథలను కూడా పండిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆయన మొదటి వరుసలో ఉంటాడు.

‘నాంది’తో మరోసారి ప్రూవ్ చేసుకున్న నరేశ్

నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాక్టింత్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటాడు. ‘నాంది’కి ముందు కొంత కాలంగా నిరాశలో ఉన్నాడు నరేశ్. నాందితో ఆయన సక్సెస్ అందుకున్నాడు. సీరియస్ పాత్రలో ఆయన నటటను చూసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దీని కంటే ముందు వచ్చిన ‘గమ్యం’ చిత్రంలో ఆయన నటన గురించి చెప్పక్కర్లేదు. మూవీకి అవార్డుల పంట పండగా ఇందులో నరేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి.

‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ గురించి

నరేశ్ హీరోగా శుక్రవారం (నవంబర్ 24)న రిలీజైన చిత్రం ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం. ఈ మూవీ ఆయనకు 59వది. ‘హాస్య మూవీస్-జీ స్టూడియోస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్ మోహన్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఫారెస్ట్ లోని ఒక గ్రామం, (మారేడుపల్లి) అక్కడ నివసించే ప్రజల గురించి ఉండబోతోందని ట్రైలర్ లో తెలుస్తుంది. ఇందులో నరేశ్ టీచర్ గా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఎలక్షన్ ఆఫీసర్ గా నరశ్ కనిపించబోతున్నారు.

నరేశ్ ఏమన్నారంటే

గతంలో ఈ చిత్రంపై చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నరేశ్ చిత్రం, తదితర విషయాలను వివరించే ప్రయత్నం చేశాడు. నగరంలో బతుకుతున్న వారే అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ఇక గ్రామాలు, అందులో అడవుల్లో బతికే వారి స్థితిగతులు, వాటిని వారు ఎలార్కోవాలే చెప్పే ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా తన పాత్ర తదితరాలను వివరించాడు నరేశ్. మౌలిక సౌకర్యాలపై ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులకు నచ్చజెప్పి వారిని పోలింగ్ వరకూ ఎలా తీసుకొని రావాలో అన్న కోణంలో సినిమా సాగుతుందని తను ఇప్పటి వరకు తీసిన సినిమాలకంటే ఇది డిఫరెంట్ అంటూ చెప్పాడు.

56 రోజుల్లోనే షూటింగ్ పూర్తి

ఈ సినిమాను డైరెక్టర్ ఏఆర్ మోహన్ కేవలం 56 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 4 కోట్ల ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ కోసం రూ. 4.5 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. నైజాంలో 150 థియేటర్స్, సీడెడ్ 60, ఆంధ్రా 180కి పైగా థియేటర్స్ లో, ఇక ప్రపంచ వ్యాప్తంగా 510 థియేటర్స్ లలో శుక్రవారం రిలీజ్ అవుతుంది. నరేశ్ కు జంటగా ఆనంది అలరించనుంది. ఈమె ‘జాంబీ రెడ్డి’, ‘శ్రీదేవీ సోడా సెంటర్’ మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఇది ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.