యూటూబ్ స్టార్స్ శ్రీహాన్, సిరి ప్రేమ గురించి వేరేగా చెప్పక్కర్లేదు. వీరు యూటూబ్ లో చాలా వరకు షార్ట్ ఫిలింలు చేశారు. ప్రస్తుతం శ్రీహాన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా హౌజ్ లో ఉన్నాడు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆయనను కలిసేందుకు సిరి హౌజ్ లోకి ఎంటర్ టైంది. దీంతో హౌజ్ లో వినూత్న ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. సీజన్ స్ర్టాటై మూడు నెలలు గడుస్తుండడంతో హోం సిక్ ను తగ్గించేందుకు బిగ్ బాస్ ఫ్యామిలీ మీట్ ను ఏర్పాటు చేశాడు.
హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘సిరి’
దీనిలో భాగంగా హౌజ్ లో ఉన్నవారికి కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌజ్ లోకి వస్తున్నారు. గత వారం ఆదిరెడ్డి భార్య, కూతురు రాగా కూతురు బర్త్ డే వేడుకలను హౌజ్ లో ఘనంగా నిర్వహించారు ఆదిరెడ్డి. హౌజ్ మేట్స్ కేక్ ఏర్పాటు చేయగా సందడిగా గడిచింది. ఇప్పుడు శ్రీహాన్ ను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోయిన ఆయన లవర్ సిరి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడంతోనే శ్రీహాన్ ను ముద్దులతో ముంచేసింది సిరి. వీరిద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండ్ ఉంది. శ్రీహాన్ కుటుంబ సభ్యులు కాకుండా సిరి రావడంపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కన్నీరు పెట్టకున్న శ్రీహాన్.. హత్తుకున్న సిరి
శ్రీహాన్, సిరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ 5లో సిరి కంటెస్టెంగ్ గా ఉన్న సమయంలో ఆమె కోసం శ్రీహాన్ వచ్చాడు. ఈ సారి రివర్స్ అయ్యింది. హౌజ్ లో కంటెస్టెంట్ గా శ్రీహాన్ ఉండగా ఫ్యామిలీ మీట్ లో భాగంగా ఆయనను కలుసుకునేందుకు సిరి వచ్చింది. మూడు నెలల గ్యాప్ ను దాదాపు ఫిల్ చేసింది ఈ జంట. హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు సిరి, శ్రీహాన్. ఫ్రీజింగ్ స్టేజ్ లో ఉన్న శ్రీహాన్ తన ప్రియురాలు సిరిని చూడగానే ఏడ్చేశాడు. సిరి అతని కన్నీరు తుడుస్తూ హత్తుకుంది. దీంతో బిగ్ బాస్ ఫ్రీజ్ కావాలంటూ అనౌన్స్ చేయడంతో ఇద్దరూ రొమాన్స్ ను ఎంజాయ్ చేశారు.
టాటూతో పొంగిపోయిన శ్రీహాన్
హౌజ్ లో ఉన్న శ్రీహాన్ కు సిరి ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పింది. ఏంటని శ్రీహాన్ ప్రశ్నించగా మొదట కళ్లు మూసుకో చెప్తానని చెప్పింది. శ్రీహాన్ కళ్లుమూసుకోవడంతోనే వెనుకకు తిరిగిన సిరి అతని చేతి వేళ్లను తన వీపుపై పెట్టుకొని కళ్లు తెరువు అని చెప్పింది. అక్కడ ఉన్న టాటూను చూసి శ్రీహాన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అక్కడ శ్రీహాన్ పేరును టాటూగా వేయించుకుంది సిరి.
శ్రీసత్యకు వార్నింగ్
హౌజ్ లో శ్రీహాన్ శ్రీసత్యతో సన్నిహితంగా ఉండడంతో సిరికి కొంచెం అనుమానం మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. సాఫ్ట్ గా శ్రీసత్యకు వార్నింగ్ ఇచ్చింది. ‘సిరి నిన్ను శ్రీహాన్ చింకీ ఫేస్ అంటాడని’ రేవంత్ చెప్పగా.. ‘క్యూట్ అని కూడా అన్నానని చెప్పవేంట్రా’ అని శ్రీహాన్ రేవంత్ తో అన్నాడు. శ్రీహాన్ మాట విన్న సిరి.. క్యూట్ నేను కాదులే శ్రీసత్య అయి ఉంటుందని చురకవేసింది సిరి. ‘శ్రీహాన్ ను ఏడిపిస్తున్నాను ఏమీ అనుకోకు సిరి’ అంటూ శ్రీసత్య అనగా.. కచ్చితంగా అనుకుంటాను ఇక మీదట ఏడిపించకు అని శ్రీసత్యను కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది.