విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రం ‘దమ్కీ’. ఇటీవల నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసిన ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. చిత్ర నిర్మాణం పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ‘దమ్కీ’ మూవీ రిలీజ్ డేట్ ను రీసెంట్ గా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
వచ్చే ఏడాదిలోనే
2023 ప్రారంభంలో వరల్డ్ వైడ్ గా థియేటికల్ గా విడుదల చేయబోతున్నట్లు హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేధికగా మంగళవారం (నవంబర్ 22) అనౌన్స్ చేశారు. ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా దమ్కీ. నివేథా పెతురాజ్ విశ్వక్ సేన్ సరసన నటిస్తున్నారు. ఈ మూవీ రొమాంటిక్, కామెడీ, యాక్షన్ కలగలిపి ఉంటుందని విశ్వక్ సేన్ వివరించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పారు.
ఫిబ్రవరి 17న థియేటర్లలోకి
పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమా 17 ఫిబ్రవరి, 2023లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ నేపథ్యంలో మేకర్స్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీకి హీరో తండ్రి కరాటే రాజు ‘వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లియోన్ జేమ్స్ అందిస్తుండగా, మాటలు ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను అన్వర్ అలీ తీసుకున్నారు. రావు రమేశ్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్, తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
క్రేజ్ సంపాదించుకున్న ట్రైలర్
బాలకృష్ణ ఇటీవల విడుదల చేసిన మూవీ ట్రైలర్ సోషల్ మీడియా వేధికగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మిలియన్ల వ్యూవ్స్ ను దాటిపోయింది. ట్రైలర్ ను చూసిన అభిమానులు సినిమాపై ఒక అంచనాకు వస్తున్నారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తుంది కాబట్టి హిట్ అవుతుందని కామెంట్ కూడా చేస్తున్నారు. రెండు విభిన్న రోల్స్ ను విశ్వక్ పోషిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక రోల్ నెగెటివ్ గా, మరోటి పాజిటివ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఫలక్ నుమాదాస్ లా ఇందులో కూడా కొన్ని అభ్యంతరకమైన డైలాగులు ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
రెండు షెడ్లలో మంచి ఫర్మార్మెన్స్
విశ్వక్ సేన్ తనదైన మోడిలేషన్ తో రెండు షెడ్లలో మంచి ఫర్మార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల విశ్వక్ తీసిన సినిమా ‘ఓరి దేవుడా’ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. విక్టరీ వెంకటేశ్ తో తీసిన ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తూ కామెడీ డ్రామాగా సాగింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు విశ్వక్ సేన్ అన్ని రంగాల్లో రాణిస్తారని కామెంట్లు కూడా చేశారు. రీసెంట్ గా వస్తున్న ‘దమ్కీ’ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.