అనసూయ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..!

0
557

అనుసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఐదున్నర అడుగుల అందగత్తె. బుల్లి తెరను ఎంతో కాలం అలరించిన ఈ అందాల భామ వెండితెరను కూడా ఏలుతుందంటే సందేహమే లేదు. తక్కువ చిత్రాలైనా మంచి స్కోప్ ఉన్న వాటిని ఎంచుకోవడంతో పాటు తన సినిమాలో తన పాత్రే కనిపించేట్లు చేసుకోవడంలో అనసూయ పాటించే టెక్నిక్స్ అంతా ఇంతా కాదు. రంగస్థలంలో రంగమత్తకు ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. పాత్ర నిడివి చిన్నదైనా దుమ్మురేపింది ఆమె. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్పలో ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పర్లేదనుకుంటా.

నాగలో చిన్నరోల్ లో నటించింది

15 మే, 1985లో పుట్టిన అనసూయ 2008లో భద్రుకా కాలేజీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు తర్వాత ఒక గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ గా పని చేశారు. సాక్షి టీవీలో న్యూస్ ప్రజెంటర్ గా కూడా వ్యవహరించారు అనసూయ. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ‘నాగ’లో ఆమె ఒక చిన్న పాత్రను వేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఆమె జీవితం ఎన్నిమలుపులు తిరిగిందో మనందిరికీ తెలిసిందే.

సుషాంత్ తో పెళ్లి

మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ లో ఈ టీవీలో వచ్చిన ‘జబర్ధస్త్’కు యాంకర్ గా సెలక్టయిన అనసూయ ఇక వెనకకు తిరిగి చూసుకోలేదు. వరుసగా వస్తున్న ఎపీసోడ్లతో ప్రతి ఎపీసోడ్ కు ఆమె కొత్తగా కనిపించారు. ఈ షోకు ఇంత హైప్ రావడంలో ఆమె పాత్ర కూడా ఉందని అందరికీ తెలిసిందే. అనసూయ ఎంట్రీ డ్యాన్స్ కోసం కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ కాచుకొని చూసేవారంటే సందేహం లేదు.

తన వ్యక్తిగత జీవింలో సుషాంక్ భరద్వాజ్ తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారు అనసూయ. కాలేజ్ డేస్ లో ఎన్‌సీసీ ఫ్రెండ్స్ సుషాంక్. పెద్దలను ఎదురించి మరీ 2010లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సుషాంక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ తో పాటు ఫైనాన్సియర్ గా ఉన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

జబర్ధస్త్ కు స్వస్తీ

బుల్లితెరను ఏలిన అనసూయ వెండితెరపై రాణించాలని ఆది నుంచి కష్టపడుతూ వచ్చింది. కొన్ని సినిమాల్లో చేసినా ఆమె పాత్రకు గుర్తింపు వచ్చినా సినిమాలు మాత్రం ఫ్లాపులుగా మిగిలిపోయాయి. జబర్ధస్త్ షోను కంటిన్యూ చేసుకుంటేనే మొదలు కొన్ని సినిమాలు తీశారు అనుసూయ. ఇటీవల ఆమెకు వెండితెరపై ఆఫర్లు జోరందుకున్నాయి. దీంతో జబర్ధస్త్ కు స్వస్తీ పలికి వెండితెరపైపు వెళ్లిపోయారు. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారిపోయారు.

పుష్ప సినిమాలో ఆమె సునీల్ పక్కన చేసిన రోల్ అందరినీ ఆకర్షించింది. ఇటీవల చిరంజీవితో కలిసి ‘గాడ్ ఫాదర్’లో కూడా జర్నలిస్టుగా నటించారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తండ’లో ఆమె నటిస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఉత్సాహం చూపుతుంది. గురుజాడ నవల కన్యాశుల్కంను వెబ్ సిరీస్ గా తీస్తుండగా అందులో వేశ్య పాత్ర అయిన మధురవాణిగా ఆమె నటిస్తుందని తెలుస్తోంది.