అందం అభినయం కలగలిసిన యంగ్ హీరోయిన్ శ్రీలీల. కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె మొదటి సినిమా ‘పెళ్లి సందD’. ఈ సినిమా అంతగా హిట్ కాకపోయినా ఆమెకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. తర్వాత చాలా ప్రాజెక్టుల్లో నటించింది. ఇందులో ఈ మధ్య వచ్చిన ‘ధమాకా’ కూడా ఒకటి. ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. కానీ శ్రీలీల పర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మంచి ఎక్ర్పెషన్స్ పలికిస్తూ అందంతో ఆకట్టుకున్నారంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది శ్రీలీల.
మహేశ్ బాబుతో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
ప్రస్తుతం యంగ్ హీరోయిన్లతో పోలిస్తే ఎక్కువగానే ప్రాజెక్టులతో, చేతి నిండా పనితో ఉన్నారు శ్రీలీల. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక సినిమాలో చేసేందుకు ఛాన్స్ కూడా కొట్టేసింది. ఈ సినిమాలో నటించాలంటే చాలా కండీషన్స్ పెట్టిందట ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఒకటి, రెండు సినిమాలు చేయడంతో చాలానే పొగరు పెరిగింది అంటూ ఇండస్ట్రీలో చర్చ కొనసాగుతుంది. మహేశ్ బాబుతో కలిసి సినిమా చేసేందుకు చాలా మంది యంగ్ హీరోయిన్లు క్యూలో నిలబడతారు. అవకాశం దక్కించుకున్న శ్రీలీల ఇలా కండీషన్లు పెట్టడం ఏంటని కొందరు చర్చించుకుంటున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీలో రాణించడం కష్టం అంటూ కూడా చెప్తున్నారు.
రెమ్యునరేషన్ మూడింతలు పెంచేసిన శ్రీలీల
ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె అమాంతం పెంచేశారట. ఇప్పుడు తీసుకుంటున్న దానికంటే మూడింతలు ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారట. ఈమె తలపొగరు చూసి డైరెక్టర్ తో పాటు నిర్మాత, హీరో కూడా షాక్ అవుతున్నారట. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబోలో ఎస్ఎస్ఎంబీ 28 రాబోతోదని మనకు తెలిసిందే. ఇందులో మేయిన్ హీరోయిన్ పూజా హెగ్డే కాగా సెకెండ్ హీరోయిన్ గా శ్రీలీలను సెలక్ట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మేయిన్ రోల్ కాకున్నా కండీషన్లు పెట్టడంపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది.
చిత్రం నుంచి తప్పుకున్నారా.. తప్పించారా..?
ఇక ఆమెకు సెట్ లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలట. ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలట. అది కావాలి, ఇది కావాలి అంటూ బోలెడు కండీషన్లు పెడుతుందట. దీనిపై నెటిజన్లు, త్రివిక్రమ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఏదో ఒకటి, రెండు సినిమాలకే ఇంత తలపొగరు సరికాదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఆమె సొంతంగా తప్పుకున్నారా లేక యూనిట్ సాగనంపిందా.. అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ మేకర్స్ స్పందిస్తేనే తెలుస్తుంది.
హెచ్చిరిస్తున్న ఇండస్ట్రీ పెద్దలు
ఏది ఏమైనా శ్రీలీల ఈ తరహా వ్యవహారం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇండస్ట్రీలోని పెద్దలు. స్టార్ డైరెక్టర్, హీరోతో చేస్తున్నప్పుడు ఒద్దికగా ఉండాలి కానీ, షరతులు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు కూడా. ఇలా చేస్తే ఇండస్ట్రీకి దూరం అవుతావని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దీనిపై పలు విధాలుగా చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి.