త్రివిక్రమ్ కథ విని నిద్రపోయిన పవన్ .. బాక్సాఫీస్ షేక్

0
250

తాను చేయబోయే కథకు ఎలాంటి హీరో ఉండాలో మొదలే నిర్ణయించుకుంటాడు దర్శకుడు. పలాని హీరో అయితే ఈ సినిమాకు పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావిస్తాడు. కానీ ఒక సారి తన అంచనాలు తలకిందులు కావచ్చు. లేదా ఆ హోరోకు అది కలిసిరాకపోవచ్చు. ఇలా కారణం ఏదైనా ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్టు మరో హీరో చేతిలోకి వెళ్లి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక చేయని హీరో పరిస్థితి, చేసిన హీరో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఇది కామననే చెప్పక తప్పదు మరి.

త్రివిక్రమ్ కథ వింటూ నిద్రపోయిన పవన్

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ షిప్ గురించి ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేదు. వీరి కాంబోలో వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మొదట్లో త్రివిక్రమ్ ఏ సినిమా తీయాలనుకున్నా పవన్ కళ్యాణ్ ను సంప్రదించేవారు. ఈ నేపథ్యంలో అప్పట్లో వచ్చిన ఒక చిత్రం గురించి పవన్ కళ్యాణ్ ను సంప్రదించారు. కథ ప్రారంభించిన కాసేపటికి పవన్ కళ్యాణ్ నిద్రపోయారట. దీంతో త్రివిక్రమ్ కథ నచ్చలేదనుకున్నారు. చేసేది లేక మరో హీరోతో చేయాలని అనుకున్నాడు.

‘జయభేరి’కి నచ్చిన కథ

త్రివిక్రమ్ ‘ఒక్కడు’ కథతో సినిమా తీయాలని అనుకున్నాడు. మొదట జయభేరి ఆర్ట్స్ బ్యానర్ అధినేత మురళీ మోహన్ ను సంప్రదించాడు. దీంతో ఆయన ఒకే చెప్పి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు. ఇక కథ పవన్ కళ్యాణ్ కు నచ్చలేదని తెలిసింది. దీంతో మరో హీరో కోసం వెతకడం ప్రారంభించాడు త్రివిక్రమ్. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు మంచి క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ తన కథను ఉదయ్ కిరణ్ కు వినిపించారు. అతను సరే అన్నారు. బయభేరి నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే ఆయనకు అప్పుడు ఉన్న బిజీ వల్ల వీలు కాలేదు. దీంతో అడ్వాన్స్ కూడా వెనక్కు ఇచ్చేశాడు ఉదయ్ కిరణ్.

మహేశ్ ను సంప్రదించిన త్రివిక్రమ్

ఇద్దరు హీరోలను సంప్రదించిన నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురయ్యారు త్రివిక్రమ్. కానీ ఇదే కథతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఆయనకు తెలుసు. ఎలాగైనా మరో హీరోను పట్టకోవాలి అనుకున్నాడు. అప్పడు ఆయనకు కనిపించింది మహేశ్ బాబు. మహేశ్ బాబు ఆ సమయంలో మహేశ్ బాబు ‘నాని’ చిత్రం షూటింగ్ లో ఉన్నారు. సెట్ కు వెళ్లిన దర్శకుడు త్రివిక్రమ్ మహేశ్ బాబును సంప్రదించి తన కథను వివరించారట.

వసూళ్ల వర్షం

కథ విన్న మహేశ్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంకేముందు పెద్ద బ్యానర్, స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో ఇక ఆ చిత్రం వసూళ్లను మాత్రం ఆపలేకపోయింది. త్రిష హీరోయిన్ గా, మహేశ్ బాబు హీరోగా 2005లో వచ్చిన ‘అతడు’ బాక్సాఫీస్ హిట్ సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ టీవీలో ఈ చిత్రం ప్రసార సమయంలో రేటింగ్స్ బాగా పెరిగిపోతాయని టాక్ ఉంది. మంచి కమర్షియల్ మూవీ మిస్సయిన పవన్ తర్వాత కొద్దిగా బాధపడినట్లు టాక్ వినిపించింది.