ఇక పండగ చేసుకోండి అంటున్న అనుపమ పరమేశ్వరన్‌

0
301
anupama parameswaran

రోజులు మారుతున్న కొద్ది అనేక రంగాల్లో అనేకానేక మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ మార్పులకు తమను తాము మౌల్డ్‌ చేసుకుని ముందుకు సాగిన వారికే విజయం పదికాలాల పాటు వెంట ఉంటుంది. చిత్ర సీమలో కథానాయికలను తీసుకుంటే పాతతరంలో కేవలం అభినయంతోనే కథానాయికలు పదికాలాల పాటు తెరమీద వెలిగిపోయారు.

ఆ తర్వాత తరంలో అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. మరో తరం వచ్చేసరికి అందం ఒక్కటే కొలమానంగా మారింది. ప్రస్తుత ట్రెండ్‌ను తీసుకుంటే అంతా గ్లామర్‌ డాల్‌ సంస్కృతే.
ఈ తరంలో అభినయం అనేది నేతిబీరలో నేయి చందంగా మారిపోయింది.

anupama parameswaran

పెళ్లైన మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడడానికి కారణాలు!.

నేటితరం ప్రేక్షకులకు కూడా అది అవసరం లేదనుకోండి. ఎందుకంటే ఇవాళ థియేటర్స్‌కు వస్తున్న ప్రేక్షకులు దాదాపు యూత్‌ అనేది తెలిసిందే. వీరికి కావాల్సింది హీరోయిన్స్‌ ఏడుపులు, పెడబొబ్బలు కాదు.. వారు చూపించి జబ్బలు మాత్రమే.

ఈ సీక్రెట్‌ను పసిగట్టారు కాబట్టే మన కథానాయికలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.
తాజాగా ఈ కోవలోకి అందం, అభినయం కలబోసిన నటి అనుపమ పరమేశ్వరన్‌ కూడా వచ్చి చేరారు. మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘ప్రేమమ్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలై ‘శతమానం భవతి’తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తొలి నుంచీ గ్లామర్‌గా కనిపిస్తూనే నటన ద్వారా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు అనుపమ. అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా మిగిలిన నటీమణులు దూసుకుపోతుంటే తాను మాత్రం ఇంకా ఏదో ఒక చట్రంలో బిగుసుకుపోయినట్లు ఫీలైన ఆమె ఇక నుంచి మిగిలన వారితో పోటీ పడాలని, ఇందు కోసం అవసరం అయితే గ్లామర్‌ డోస్‌ పెంచటానికి సిద్ధమని ప్రకటించింది.

గ్లామర్‌ డోస్‌ పెంచడం అంటే.. నథింగ్‌ బట్‌ ఎక్స్‌పోజింగ్‌. అయితే ఒక కండీషన్‌ మీదనే అట. అదేంటంటే తాను అడిగిన రెమ్యునరేషన్‌ ఇచ్చిన సినిమాలకు మాత్రమే ఈ బంపర్‌ ఆఫర్‌ అంటోంది. అంటే ఈమె కూడా దీపం ఉండగానే… కాన్సెప్ట్‌లోకి వచ్చేసినట్టుంది.

ఈమధ్యనే వచ్చిన ‘రౌడీ బాయ్స్‌’లో ఈ డోస్‌ పెంచి చూపించింది కూడా. ప్రస్తుతం సిద్ధు సరసన నటిస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘టిల్లూ స్క్వేర్‌’ లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది. మొత్తానికి తన కొత్త ఆఫర్‌కు అప్పుడే ప్రొడ్యూసర్స్‌ ఓకే చెప్పేసినట్టున్నారు.