బన్నీవాసు సిగ్గు, శరం వదిలేశారో లేదో

0
291
bunny vasu

ఒకప్పుడు సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. కానీ కాలక్రమంలో ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ప్రయాణం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన తమిళనాడులో నట దిగ్గజం ఎం.జి. రామచంద్రన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ట్రెండ్‌ బాగా పాపులర్‌ అయింది.

ఆయన తర్వాత నటి జయలలిత, రచయిత కరుణానిధి ఇలా చాలా మంది సినిమాలు రాజకీయాలను ఒకేతాటిపైకి తెచ్చారు. ఇక మన తెలుగు రాజకీయాల్లో అన్న యన్‌.టి.ఆర్‌ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.

bunny vasu

జపాన్ లో 430 రోజులు పూర్తి చేసుకున్న RRR!…

అలాగే నటులు కృష్ణ, జమున, జగ్గయ్య, రామానాయుడు, చిరంజీవి, మురళీమోహన్‌, బాబూమోహన్‌ ఇలా చాలా మంది వెండితెర వేల్పులు రాజకీయ రంగంలో కూడా రాణించి చట్ట సభల్లోకి అడుగుపెట్టారు.
తాజాగా ఈ కోవలోకి మెగా కాంపౌండ్‌కు చెందిన నిర్మాత బన్నీవాసు కూడా చేరారు.

2024లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయం అనధికారికంగా కన్‌ఫర్మ్‌ అయిపోయింది. చంద్రబాబుతో చర్చల్లో ఈ సీటు గురించి పవన్‌ క్లారిటీ తీసుకున్నారట. బన్నీ వాసు జనసేన స్థాపన నుంచి పవన్‌ కోసం, పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు.

తనకున్న సినీ పరిచయాలు, వివిధ జిల్లాల్లో ఉన్న తమ డిస్ట్రిబ్యూటర్స్‌, మెగా అభిమానుల ద్వారా గ్రౌండ్‌ లెవల్‌ రియాల్టీ తెలుసుకుని పవన్‌కు చేరవేస్తూ ఉంటారు. ఇటీవల కోటబొమ్మాళి పీఎస్‌ సక్సెస్‌ మీట్‌లో ఆయన ప్రత్యక్ష రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ… పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాను.

అయితే నేను ఎంపీగా పోటీ చేస్తానా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా? అనేది మాత్రం నేను సంపాదించే డబ్బును బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అన్నీ డబ్బుతో ముడిపడిపోయాయి కదా అన్నారు.

అంతే కాకుండా ఇవాళ రాజకీయాల్లోకి రావాలంటే సిగ్గు, శరం, అభిమానం, మొహమాటం వదిలేయాల్సిందే. అలా తయారయ్యాయి పాలిటిక్స్‌ అన్నారు. మరి బన్నీ వాసు సిగ్గు, శరం వదిలేశారో లేదో.