నాలుగో రోజు భారీగా పడిపోయిన కలెక్షన్ లు.. ఇక ఎత్తేసినట్లే

0
2294

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్ విడుదల అయి తొలి రోజు అన్ని సినిమాల లానే మంచి వసూళ్లు సాధించింది. ఏ పెద్ద హీరోకైనా ఇది మాములు విషయమే. తోలి రోజు టాక్ ని బట్టి ఆ తరువాతి రోజు నుండి కలెక్షన్ లు ఉంటాయి. తోలి రోజు సినిమా చూసిన అభిమానులు ఎప్పటి లాగే అబ్బో సూపర్, బంపర్ అని చెప్పుకోవడం కూడా సాధారణమే. అలాగే పవన్ కి అనుకూలంగా, సినీ ఇండస్ట్రీ కి దగ్గరగా ఉండే వెబ్ సైట్ లు కూడా అదరహో అని డప్పు కొట్టాయి.

ప్రీ బుకింగ్ తప్పితే కలెక్షన్ లేదు

ఎంత డప్పు కొట్టినా సినిమాలో విషయం లేకపోతే.. అది అట్టర్ ప్లాప్ అవ్వడం ఖాయం. భీమ్లా నాయక్ విషయంలో అదే జరిగింది. తోలి రోజు అభిమానులు నుండి వచ్చిన కలెక్షన్ తప్పితే.. రెండో రోజు నుండి సగానికి పైగా కలెక్షన్ లు పడిపోయాయి. ఏదయినా పెద్ద హీరో సినిమా వస్తుందని ఆతృతతో అభిమానులు, సినీ అభిమానులు ముందే టికెట్ లు బుక్ చేసుకుంటారు. అందుకే తోలి రోజు కలెక్షన్ లు రావడం మాములు విషయమే.

సినిమా అస్సలు బాలేదని మౌత్ టాక్

ఇక శనివారం, ఆదివారం సెలవు దినాలు ఉన్నా కూడా పవన్ సినిమాకి భారీగా కలెక్షన్ లు రాలేదు. ఇక సోమవారం కలెక్షన్ లు ఇంకా దారుణంగా పడి పోయాయి. నాలుగో రోజు భీమ్లా నాయక్ చిత్రం సుమారు 5 కోట్ల మేరకు మాత్రమే వసూళ్లు చేసింది. మూడో రోజుకు నాలుగో రోజుకి కలెక్షన్ లు సగానికి పైగా పడిపోయాయి. అసలు సినిమా చూడడానికి సాధారణ ప్రేక్షకుడు ఆసక్తి చూపించక పోవడం విశేషం. సినిమా పై మొదటి రోజు డప్పు కొట్టినా.. రెండో రోజు నుండి సినిమా అస్సలు బాలేదని మౌత్ టాక్ బాగా వెళ్ళింది. అందుకే సాధారణ ప్రేక్షకుడు థియేటర్ కి రావడం లేదు.

సాహో 400 కోట్లు వసూళ్లు చేసినా ప్లాప్

శివరాత్రి ఉండడంతో.. పోటీ సినిమా ఏది లేకపోవడంతో ఐదో రోజు కొంత కలెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తరువాత రోజు నుండి సినిమా కి వచ్చే ప్రేక్షకుడు కరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 35 కోట్లు దాకా వసూళ్లు చేయాల్సి ఉంది. ఆ కలెక్షన్ వచ్చే లోగా థియేటర్ యాజమాన్యం సినిమాని ఎత్తేయకుండా ఉండాలి. అయితే కలెక్షన్ 80 కోట్లు దాటిందని.. సినిమా హిట్ అని భ్రమలో ఉండవచ్చు. ప్రభాస్ సాహో చిత్రం 400 కోట్లు వసూళ్లు చేసినా ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇది కూడా ఇంతే.