సంక్రాంతి బరికి దూరంగా ‘వాల్తేరు వీరయ్య’.. మెగా అభిమానులకు షాక్

0
1783

సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ర్టాలకు పెద్ద పడగే.. ఇక సినిమా ఇండస్ర్టీకైతే అతిపెద్ద పండుగ.. అందు కోసం నిర్మాతలు ఈ పండుగకే తమ బ్యానర్‌లో సినిమా రిలీజ్ కావాలని తెగ తహ తహ లాడిపోతారు. దాదాపు అక్టోబర్, నవంబర్ నుంచే డిస్ర్టిబ్యూటర్లను అలెర్ట్ చేస్తూ థియేటర్లను బుక్ చేసుకోవడం కూడా మొదలుపెడుతారు. దాదాపుగా సంక్రాంతికి ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఇద్దరు స్టార్ హీరోల మెగా సినిమాలు రిలీజ్ ఉంటుందని ఇండస్ర్టీ, ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రెండు సినిమాల రిలీజ్ అవుతాయా..?

దీంతో పాటు ఇటీవల ప్రొడ్యూసర్స్ మధ్య వివాదాలకు తెరలేపిన మరో డబ్బింగ్ సినిమా కూడా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన రెండు చిత్రాలు ఈ సారి సంక్రాంతి బరిలో ఉంటాయని టాలీవుడ్ ఇండస్ర్టీ గత కొంత కాలంగా చెప్తూ వస్తోంది. అందులో ఒకటి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కాగా రెండోది బాలయ్య బాబు చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఉన్నాయి. ఇక తమిళ్ టూ తెలుగు డబ్బింగ్ చిత్రం ‘వారాసు’ కూడా. వీటిలో చిరంజీవి, బాలకృష్ణ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుండగా, వారాసు మాత్రం దిల్ రాజు తన సొంత బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.

సింక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ దూరమా?

ఇప్పటి వరకూ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజైన దాఖలాలు లేవు. మైత్రీ మూవీ మేకర్స్ చిరిత్రను తిరగరాయాలను కుంది. కానీ ఇప్పుడు దీనికి బ్రేకులు పడేలా కనిపిస్తోంది. చిత్ర వర్గాల్లో కూడా జోరుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇది చిరు అభిమానులను కూడా నిరాశకు గురిచేస్తోంది. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఫిలింనగర్ లో లీకులు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉందని, అందుకే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక సంక్రాంతికి సరిగ్గా నెలా వరకూ ఉంది.

ఇప్పటికీ ఎటువంటి అప్ డేట్ లేనట్టే..!

ఇందులో షూటింగ్ పూర్తి కావాలి దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తర్వాత ప్రమోషన్ వీటన్నింటినీ అధిగమిస్తేనే మూవీ థియేటర్ లోకి వస్తుంది. అయితే ఇందులో మెగాస్టార్ బిగ్ స్టార్ కాబట్టి ప్రమోషన్ విషయంలో బెంగలేదు. కానీ షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తు్న్నాయి. ఇక ఇప్పటి వరకూ ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించి బాస్ పార్టీ సాంగ్ మినహా ఏ అప్ డేట్ లేదు. ఈ మూవీలో కీరోల్ పోషించిన మాస్ మహరాజ్ రవితేజకు సంబంధించి టీజర్ ను డిసెంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు.

వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్

ఇంకా 5న పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పిన చిత్ర యూనిట్ ఆ దిశగా ఎటువంటి అప్ డేట్స్ లేవు. దీంతో ఈ సినిమా వాయిదా పడ్డట్లే అన్న అనుమానాలు మరింత పెరిగాయాయి. అయితే బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’కి సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్ (12 జనవరి, 2023) కూడా చిత్ర యూనిట్ ప్రకటించేసింది. వాల్తేరు వీరయ్యపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేకపోవడంతో చిరు ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఈ అనుమానాలపై మైత్రీ మూవీ మేకర్సే క్లారిటీ ఇవ్వాలి మరి.