ఆ పెళ్లికి అందరి ఆశీస్సులు.. అనాథను ధర్మపత్నిగా చేసుకున్న మారాజు

0
362

కట్నాలకు అమ్ముడు పోయే మగవాళ్లు ఆయనను చూసి నేర్చుకోవల్సిందే.. అవును మరి అమ్మాయి నచ్చినా, వారి కుటుంబం బాగున్నా ఇంత కట్నం కావాలి.. అంత కట్నం కావాలి.. అంటూ అర్రులు చాస్తున్న రోజుల్లో కూడా కట్నాలు కాదు గదా కుటుంబ కూడా లేకున్నా పరవాలేదు అనుకున్నాడు ఆయన. వృత్తి పరంగా అతడు ప్రభుత్వ ఉద్యోగి కావాలంటే ఎంత కట్నమైనా పోసి పిల్లనిచ్చేందుకు చాలా మంది క్యూలో ఉంటారు. కానీ వారందరినీ కాదని ఒక అనాథను తన జీవితంలోకి తెచ్చుకోవాలని అనుకున్నాడు.

తరాలలో ఏముంది

పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అని పెద్దలు చెప్తారు. వరుడికి సంబంధించి కుటుంబం, చేసే ఉద్యోగం, ఇల్లు, స్థలాలు, తదితరాలు చూస్తే, ఇక వధువుకు సంబంధించి వారి కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా తల్లి ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు. వీటన్నింటినీ దాటితే మరో పెద్ద గండం ఉంటుంది. అదే కట్నం మా అబ్బాయి ఇంత సంపాదిస్తున్నాడు కట్నం ఇంత కావాలి.. అంత కావాలి.. అంటూ పేచీలు పెడతారు. చివరికి సంపాదనను బట్టి వరుడు అమ్ముడు పోవాల్సిందే. అమ్మాయి కూడా ఉద్యోగంలో ఉన్నా కట్నం మాత్రం మెండుగా కావాల్సిందే. లక్షలు కట్నం కావాలంటూ మగపెళ్లి వారు పేజీలు పెడతారు.

మనసున్న మారాజు

ఇంకొందరు తనతో బతికే అమ్మాయి. గుణగణాలు బాగుంటే చాలు. కష్టపడి పుప్పూటలా తిండి పెడతాను అంటూ మనసున్న మారాజులు కూడా కొందరు ఉంటారు. ఉండేందుకు ఇల్లు, తన వారని చెప్పుకునేందుకు ఎవరూ లేని అనాథలను తమ జీవితంలోకి ఆహ్వానించి వారికి అన్నీ తామై సంతోషంగా చూసుకుంటారు మరి కొందరు. తాజాగా ఇలాంటిదే కర్ణాటకలో జరిగింది.

హేమంత్-గురు సిద్ధమ్మ పెళ్లి

కర్ణాటక రాష్ర్టం, హుబ్లీలోని కేశ్వాపురంలోని అనాథ శరణాలయంలో ఇటీవల ఒక వివాహం జరిగింది. ఈ వివాహం విషయం ఇప్పుడు రాష్ర్టంతో పాటు దేశ ప్రజలు కూడా ఆదర్శ వివాహంగా కీర్తిస్తున్నారు. బెంగళూర్ కు చెందిన సరస్వతీ-నంజుండ రావు దంపతుల కొడుకు హేమంత్. అతను ఆదాయ పన్ను శాఖలో మంచి కొలువు చేస్తున్నాడు. అతనికి పెళ్లి చేయాలని అనుకున్న తల్లిదండ్రులు కులం, గోత్రం, కట్న, కానుకలు తదితరాల గురించి ఏమీ ఆలోచించలేదట. మంచి యువతి ఇంటికి కోడలైతే ఇల్లు బాగుంటుందని అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా ఒక అనాథ శరణాయాన్ని సంప్రదించారు. తన కొడుకుకు ఈడు జోడు ఉన్న అమ్మాయిని చూశారు.

స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు

తల్లిదండ్రుల నిర్ణయాన్ని హేమంత్ కూడా సమ్మతించాడు. వెంటనే సదరు యువతి గురు సిద్ధమ్మ మెడలతో తాళి కట్టాడు. హేమంత్-గురు సిద్ధమ్మ వివాహం ఆమె ఉన్న అనాథ శరణాలయంలోనే గ్రాండ్ గా నిర్వహించారు. గురు సిద్ధమ్మ తరుఫుణ అనాథలు పెళ్లి పెద్దలుగా, హేమంత్ తరుపుణ వారి బంధువులు వేడుకలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హేమంత్ పై ప్రశంసలు కురిపిస్తూ, దంపతులను ఆశీర్వదించారు. గురు సిద్ధమ్మ తల్లిదండ్రులు ఆమె బాల్యంలోనే చనిపోవడంతో అనాథాశ్రమంలో పెరిగింది.