షూటింగ్ లో బాలయ్య అసహనం.. అతన్ని హెచ్చిరిస్తూ తీవ్ర ఆగ్రహం

0
205

నందమూరి బాలకృష్ణకు అభిమానులు ఎక్కువ. పెట్టినా బాలయ్యే.. కొట్టినా బాలయ్యే.. అంటూ అభిమానం వ్యక్తం చేస్తారు ఫ్యాన్స్. బాలకృష్ణ కూడా ఏదీ మనుసులో ఉంచుకోడు. ఆగ్రహం వస్తే ఎంత దురుసుగా ఉంటాడో ప్రేమను కూడా అంతే పంచుతారు. అందుకే ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో ఆయన తర్వాతే ఎవరైనా.

కాస్ట్యూమ్ వర్కర్ పై ఆగ్రహం

యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీని డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. బాలయ్య బాబు లాస్ట్ మూవీ ‘అఖండ’ భారీగా హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కురిపించింది. ఇటీవల గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఈ మూవీని ప్రదర్శించారు. అదే స్థాయిలో ‘వీరసింహారెడ్డి’ని కూడా తీయాలని బాలయ్య బాబు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

టర్కీలో షూటింగ్

చిత్ర యూనిట్ షూట్ కోసం ఇటీవల టర్కీకి వెళ్లింది. అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. షూటింగ్ లో బాలయ్యకు కోపం తెంచుకోవడంతో పెద్ద రభస జరిగింది. చిత్ర యూనిట్ లో పని చేస్తున్న క్యాస్టూమ్ వర్కర్ పై బాలకృష్ణ మండిపడినట్లు వార్తలు లీక్ అయ్యాయి. షూటింగ్ విషయంలో కొంత అసహనానికి లోనైన బాలయ్య డైరెక్టర్ పై కొంత ఆగ్రహం వ్యక్త చేస్తున్న క్రమంలో కస్ట్యూమ్ వర్కర్ రావడంతో ఆయనపై కూడా విరుచుకుపడ్డాడట. బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కొంచెం కష్టమే.

చిత్ర యూనిట్ పై గుస్సా

‘సినిమాకు సంబంధించిన వర్క్ ను దర్శకుడు, నిర్మాత దగ్గరుండి చూసుకోవాలి’ కదా అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు వర్కర్ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. తర్వాత అతడు షూట్ కు కూడా రాలేదంట. ఘటన తర్వాత దర్శక, నిర్మాతలు బాలయ్యను శాంతింప జేశారట. వర్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు బాలయ్య కూడా కొంత బాధపడినట్లు తెలిసింది. సెట్ లో బాలయ్య ఉంటే సందడి ఎంత ఉంటుందో ఆయనకు కోపం వస్తే సెట్ మొత్తం సైలెంట్ అవ్వాల్సిందే. తర్వాత బాలయ్యే తేరుకొని ప్రేమ చూపుతారని చిత్ర యూనిట్ కు మొదటి నుంచి తెలిసిన విషయమే అందకే పెట్టినా బాలయ్యే.. కొట్టినా బాలయ్యే.. అంటూ తమ హీరోపై అంతప్రేమను చూపుతారు ఫ్యాన్స్.

సింహా సెంటిమెంట్

బాలయ్య ప్రతి చిత్రానికి ‘సింహా’ యాడ్ చేయడం సెంటిమెంట్ గా వస్తుంది. ఇప్పటి వరకూ చాలా చిత్రాలు సింహా పేరుతోనే ఉన్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల ఒక సాంగ్ ‘జై బాలయ్య’ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీనిపై ఆయన ఫ్యాన్స్ తో పాటు, సినీ అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సాంగ్ చిత్ర హైప్ ను పోగొడుతుందని కామెంట్ల రూపంలో చెప్పారు. ఎస్ఎస్ తమన్ ట్యూన్ కూడా బాగాలేదని, రామజోగయ్య శాస్ర్తి రాసిన పాటపై కూడా విమర్శలు గుప్పించారు. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. టాలీవుడ్ ఇండస్ర్టీలో సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు రాబోతున్నాయి.