ఆ హీరోయిన్ వల్లే రాంగోపాల్ వర్మ కెరీర్ నాశనం అయ్యిందా

0
473

దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రాంగోపాల్ వర్మ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సంచలనాలు సృష్టించారు వర్మ. ఆర్జీవో సినిమా ‘శివ’తోనే టాలీవుడ్ పరిశ్రమ మారిందనే చెప్పుకోవాలి. అప్పట్లో ఉన్న మూస ధోరణి సినిమాలను ఆయన ఒక్క సినిమాతో మార్చి వేశారు. అందుకే ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే శివకు ముందు, శివ తర్వాత అని చెప్పుకుంటారంటే ఆయన సినిమా సృష్టించిన ప్రభంజనం ఏంటో తెలుస్తుంది.

ఆ తర్వాత బాలీవుడ్ లో బిగ్ బీతో సర్కార్ చేసి అక్కడ కూడా తన జెండా పాతారు. ఇంతటి గొప్ప టాలెంట్ ఉన్న దర్శకుడు ప్రస్తుతం బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ, వల్గారిటీగా బిహేవ్ చేస్తూ తన గుర్తింపును నాశనం చేసుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆయన కూడా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కు ప్రపోజ్ చేశారట. కానీ ఆమె సున్నితంగా రిజక్ట్ చేసిందట. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు తీసిన రామూ

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీయడం రామూకు కొత్తేమి కాదు. ఇప్పుడంటే ప్రతీ సినిమా పాన్ ఇండియా అంటూ చెప్పుకస్తున్నారు కానీ రామూ అప్పట్లో తీసిన ప్రతీ సినిమా కూడా ఆ లెవలే ఉండేది. సర్కార్, రంగీళ, దౌడ్, సత్య, డీ-కంపెనీ, ఇలా ప్రతీ సినిమా ఒక వెరైటనే చెప్పాలి. రాంగోపాల్ వర్మకు అతిలోక సుందరి అయిన శ్రీదేవి అంటే చాలా ఇష్టం. కాదు కాదు.. పిచ్చనే చెప్పాలి.

ఆమె కోసమే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. నేను నీకు భక్తుడిని నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెకే చెప్పారట వర్మ. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించిందట. తర్వాత శ్రీదేవి బలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకోవడంతో చాలా ఫీల్ అయ్యరట. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలంటే మానవమాత్రులం మనకు సాధ్యం కాదు అనుకున్నారట.

అషూ రెడ్డి కాలి వేళ్లను ముద్దాడడం

శ్రీదేవి బోణీ కపూర్ ను పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తర్వాత రామూ పిచ్చివాడిగా ఇండస్ట్రీలో మిగిలిపోతారని అనుకున్నారు అందరూ. కానీ అలా జరగలేదు సరికదా.. ఆ తర్వాత ఆయన చాలా మంది హీరోయిన్లను ప్రేమించారు. ఈ మధ్య ఆయన అషూ రెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆయన అషూ రెడ్డి కాలి వేళ్లను ముద్దాడడం, చీకడం ఇలాంటి వెకిలి చేష్టలతో ఆయన అభిమానులు సైతం బాగా హర్ట్ అయ్యారట. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సీనియర్ ఐటం గర్ల్ జయమాలినిపై కూడా ఆయన సంచలన కామెంట్లు చేశాడు.

జయమాలిని సినిమాల వల్లే తన చదువుపోయిందన్న వర్మ

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయ మాలిని రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేసింది. నేను మీ వల్ల చదువు పాడు చేసుకున్నానని చెప్పాడు వర్మ. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎలా జరిగింది అని ఆమె ప్రశ్నించగా. అప్పటి సినిమాల్లో స్టార్ ఐటం గర్ల్ ఎవరంటే జయమాలిని పేరే చేప్పెవారు. ఆమె డ్యాన్స్ లేని సినిమాలు చాలా తక్కువగా ఉండేవి. దీంతో ప్రతీ రోజు ఆమె డ్యాన్స్ చూసేందుకే సినిమాకు వెళ్లేవాడిన అందుకే నా చదువు సంకనాకిపోయింది.

అందుకు కారణం మీరే అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ ఖాతాలో చాలా మంది హీరోయిన్లు, ఐటం గర్ల్స్, యాంకర్లు ఉన్నారనే చెప్పాలి. నేటి తరం యంగ్ హీరోయిన్లతో ఆయన బిహేవ్ చేసే పద్ధతిపై చాలానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతటి స్టార్ డైరెక్టర్ ఇలా అయిపోయాడేంటా అనుకుంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు.