చిరంజీవి అల్లుడి ఎమోషనల్ పోస్ట్..!? అసలు కారణం అదేనా..?

0
591

చిత్ర పరిశ్రమలోని రూమర్స్, దాని అనుబంధంగా ఉన్న నటుల కుటుంబాలపై కూడా పడుతాయి. ముఖ్యంగా ఇండస్ర్టీలో ఒక వెలుగు వెలిగిన వారికి నిత్యం నరకమే చెప్పాలి. రోజూ ఓ వార్తను వైరల్ చేసేందుకు వైరల్ రాయుళ్లు కాచుకొని కూర్చుంటారు. నటుల పర్సనల్ జీవితాలపై గాసిప్ లు క్రియేట్ చేసి వైరల్ చేయడం వారి జస్ట్ ఫన్. ఇవన్నీ పక్కన పెడితే కొణిదెల కుటుంబానికి చెందిన ఒక ట్వీట్ పై ఇప్పుడు చర్చ అవుతుంది. అది పెట్టింది ఎవరో కాదు చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.

కళ్యాణ్ దేవ్ ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న శ్రీజ

చిరంజీవి రెండో కూతురు శ్రీజను వివాహం చేసుకున్న తర్వాతనే నటుడు కళ్యాణ్ దేవ్ కు ఇండస్ర్టీలో గుర్తింపు లభించింది. కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకోకు ముందు శ్రీజ మరొకరిని వివాహం చేసుకుంది. పెద్దలను ఎదురించి మరీ అతనితో వెళ్లిపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సర్ధి చెప్పాలని చూస్తే ఆయనపై కూడా కేసులు పెట్టింది. వారికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత అత్తారింటి బాధలు భరించలేక మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఇంటికి చేరుకుంది శ్రీజ. తర్వాత ఆమె తండ్రి చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో ఆమెకు వివాహం జరిపించారు. వీరికి కూడా ఒక బిడ్డ పుట్టింది.

ప్రస్తుతం ఎవరి దారి వారిదే

కొన్ని రోజులుగా కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్తలు వ్యాపించడం మొదలవడంతోనే నటుడిగా కళ్యాణ్ దేవ్ కెరీర్ కూడా పతనమవుతూ వచ్చింది. నిజానికి కళ్యాణ్ దేవ్ ఎవరో కూడా తెలియదు. కానీ శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ అల్లుడని మెగా ఫ్యాన్ బుజాలకెత్తుకున్నారు. కానీ మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కు విభేదాలు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన కెరీర్ కూడా పతనమైందనే చెప్పాలి.

ఇన్ స్టాలో పేరు తొలిగించిన శ్రీజ

శ్రీజ కూడా తన ఇన్ స్టాలో గతలో శ్రీజ కళ్యాణ్ దేవ్ అని పెట్టకుంది. కానీ కొంత కాలానికి కళ్యాణ్ దేవ్ పేరును తొలగించి శ్రీజ మాత్రమే ఉంచుకుంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య విభేదాలు నిజమనే వార్తలకు ఉప్పందింది. కానీ ఇప్పటి వరకూ ఈ వార్తలపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం శ్రీజ తన కూతుళ్లతో కలిసి తండ్రి దగ్గరే ఉంటుండగా, కళ్యాణ్ దేవ్ మాత్రం ఒంటరిగానే తన తల్లి వద్ద ఉంటున్నాడు. ఆయనను ఇండస్ర్టీ పూర్తిగా పక్కన పెట్టింది. దీనికి తోడు ఆయన విడాకుల రూమర్స్ కూడా బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాను విడాకులు కోరుకుంటున్నట్లు ఇప్పటి వరకూ కళ్యాణ్ దేవ్ ఎక్కడా ప్రకటించనూ లేదు.

కూతురి పట్ల జాగ్రత్తలు

శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఎవరి దారి వారు చూసుకున్నా.. వీరి కూతురు నవిష్క విషయంలో మాత్రం కలిసే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ వరుస వెకేషన్లలో బిజీగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ‘ఓపిగ్గా ఉంటే.. అన్నింటికీ సమాధానం దొరుకుతుంది’ అని పెట్టిన పోస్ట్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏ ఉద్ధేశ్యంలో ఇది పెట్టాడో తెలియదు గానీ, దీనిపై ప్రస్తుతం పలు సందేహాలు ఉన్నాయి.