చిరును ఇండస్ర్టీలో తొక్కేయకుండా అల్లు ప్లాన్.. ఏం చేశారో తెలుసా..?

0
273

చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇండస్ర్టీలో అయిన వాళ్లు ఉంటారు.. కాని వాళ్లు ఉంటారు. స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తొక్కేసేందుకు పక్కనున్న వారు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇదంతా ఇండస్ర్టీకి కొత్తేమి కాదు. మంచి మంచి స్టార్ పై గాసిప్ లు క్రియేట్ చేసి తెరమరుగు చేసిన ఇండస్ర్టీ ఇది. ఇక్కడ వారానికో నటుడు, దర్శకుడు ఇన్, అవుట్ అవుతూ ఉంటారు. ఇందులో కుల, మతాలు కూడా ప్రముఖ పాత్రనే పోషిస్తాయనడంనలో సందేహం లేదు మరి. ఈ పరిస్థితులు చిరంజీవికి కూడా మొదట్లో తగిలయాట.

చిరు రాణిస్తున్న సమయంలోనే

అయితే ఆయన మామ అల్లు రామలింగయ్య వీటిని ఎలా జయించాలో సూచనలు చేశాడు. దీంతో ఆయన ఇండస్ర్టీలో రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో అతనో స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. ఆ నోటా ఈ నోటా తను పరిశీలించిన విషయాలతో అతన్ని అల్లుడిని చేసుకోవాలని అనుకున్నాడు అల్లు రామలింగయ్య. అప్పటికే అల్లు రామలింగయ్య కమేడియన్ గా సినిమాల్లో బాగా రాణిస్తున్నారు. చిరంజీవిని దగ్గరి నుంచి పరిశీలించిన రామలింగయ్య తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం జరిపించారు.

ఇండస్ర్టీ మొదట్లో వారిదే పెత్తనం

తర్వాత చిరంజీవి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ గా మారారు. అల్లు రామలింగయ్యతో కలిసి చిరంజీవి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇవన్నీ అటుంచితే.. తమిళ నాడు నుంచి విడిపోయిన తర్వాత టాలీవుడ్ గా అవతారమెత్తిన తెలుగు ఇండస్ర్టీలో మొదట్లో చౌదరీల డామినేషన్ ఉండేది. అప్పటి నుంచి దాదాపుగా ఇప్పటి వరకూ చాలా మంది టెక్నీషియన్లు కమ్మవాళ్లే. దాదాపు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తొలినాళ్లలోనే చిరంజీవి ఇండస్ర్టీకి వచ్చారు. అప్పటికే ఎన్టీఆర్ కొడుకు నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. ఆయనకు ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఉన్నారు.

చిరంజీవికి జాగ్రత్తలు చెప్పిన మామ

ఈ మధ్య కాలంలోనే చిరంజీవికి మంచి హిట్లు పడుతుండడంతో ఆయన పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఈ సమయంలో పెద్ద వాళ్లతో సక్యతగా లేకుంటే ఇండస్ర్టీలో ఎదగడం కష్టమని భావించారు అల్లు రామలింగయ్య. అప్పటికీ ఇండస్ర్టీలో తమ కులం వాళ్లు ఇంకా రాణించలేదు. దీంతో చిరంజీవికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకున్నారట రామలింగయ్య. ఒక రోజు చిరంజీవిని ఇంటికి పిలిచి ఒక విషయం చెప్పారట. ఇండస్ర్టీలో ఇప్పడిప్పుడే మంచి గుర్తింపు వస్తుంది. దీన్ని నిలదొక్కుకుంటూ మరింత ఎదగాలంటే పెద్ద వాళ్లతో సక్యతగా ఉండాలి. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు ఎన్టీఆర్ ఇంటి వద్దకు వెళ్లు. 9999 నెంబర్ తో ఒక కారు బయటకు వస్తుంది.

ఒక నమస్కారం చెయ్యి

అందులో అన్న ఎన్టీఆర్ ఉంటారు. ఒక నమస్కారం చెయ్యి. ఇలా ప్రతి రోజూ చేస్తూనే ఉండు అంటూ చెప్పారట. దీంతో ఎన్టీఆర్ కూడా మనవాడే పైకి వస్తాడు అనే ఫీలింగ్ వస్తుందని అల్లు రామలింగయ్య సూచించారట. అయితే చిరంజీవి కూడా మామ చెప్పినట్లుగా ప్రతి రోజూ చేశారట. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ను వరుదలు ముంచెత్తినప్పుడు ప్రతిపక్ష హోదాలో ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించారు. అప్పుడు చిరంజీవి రాఘవేందర్ రావు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ టీం ఆయనకు ఎదురైంది. ఆ సమయంలో ఎన్టీఆర్ చిరంజీవితో బ్రదర్ నీ చిత్రం తుఫాన్ లో కూడా కలెక్షన్ల తుఫాన్ కురిపిస్తుంది అంటూ అభినందించారు.