టాలీవుడ్ లో ఇక అతను లేరు.. చిరంజీవి దిగ్భ్రాంతి

0
6596

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యముతో బాధపడుతున్న గౌతమ్ రాజు.. గత అర్దరాత్రి హైదరాబాద్ లోని తన ఇంట్లో కన్ను మూసారు. ఇండస్ట్రీ లో ఉండే వారికి ఇంతకు బాగా పరిచయం. గౌతమ్ రాజు 800 సినిమాలకు పైగా ఎడిటర్ గా పని చేశారు. ఒక్క టాలీవుడ్ లో కాక.. తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా ఆయన ఎడిటర్ గా సినిమాలు చేసారు.

ఆయన ఎంత నెమ్మదస్తుడో

ఎడిటర్ గౌతమ్ రాజు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గౌతమ్ రాజు లాంటి సీనియర్ ఎడిటర్ ని కోల్పోవడం దురదృష్టకరం అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన చాలా సౌమ్యుడని కొనియాడారు. ఆయన ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్ అంత వేగంగా ఉంటుందని కొనియాడారు.

సినీ పరిశ్రమకి ఎంతో తీరని లోటు

ఖైదీ నం.150 , చట్టానికి కళ్లు లేవు లాంటి ఎన్నో తన చిత్రాలకు ఎడిటింగ్ చేసారని అన్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకి ఎంతో తీరని లోటని అన్నారు. గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం అని తెలియచేసారు. ఇంకా తెలుగులో గబ్బర్ సింగ్, కిక్, రేసు గుర్రం, బలుపు, అదుర్స్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన ఎడిటింగ్ చేసారు.