అద్భుతం చేసిన ముసలమ్మ

  0
  8068

  మాములుగా అక్కడక్కడా రోడ్లుపైన నీళ్లు నిలవడం మనం చూస్తూనే ఉంటాం. అలానే ఈ వీడియో లోకూడా రోడ్డుపైన నీళ్లు నిలిచాయి. అయితే ఆ నీటిలో ఒక పెద్ద రాయి ఉంది. అయినా ఆ రాయి సంగతి ఎవరూ పట్టించుకోకుండా పక్కనుండి వెళ్లిపోతున్నారు. ఆ రాయి వచ్చే పోయే వారికి అడ్డంగా ఉన్నా.. ఎవరూ దానిని పట్టించుకోవడం లేదు. అయితే అటుగా తన మనుమడి బండిపై వెళుతున్న ముసలమ్మ ఆ నీటి గుంటలో తన సంచి పడేసుకుంది. తన సంచి కోసం వచ్చిన ఆ ముసలమ్మకి కి అక్కడి రాయి కనిపించింది.

  చలించిపోయిన అమ్మాయి

  దీనితో మనుమడు వద్దని వారిస్తున్నా.. తన శక్తి నంతా కూడబెట్టుకొని ఆ రాయిని పక్కకి తీస్తుంది. కొద్దీ దూరం నెట్టిన ఆ ముసలమ్మ.. ఆ తరువాత రాయిని నెట్టలేకపోయింది. ఇంతలో అటుగా వెళుతున్న ఓ అమ్మాయికి ఈ ఘటన చూసి చలించిపోయింది. వెంటనే తన బండి ఆపి.. ఆ రాయిని అక్కడి నుండి తీసి పక్కన వేసింది. ఆ తరువాత అక్కడి సంచిని తీసుకొని ఆ ముసలమ్మని బండి ఎక్కించింది ఆ యువతి.

  యూట్యూబ్ లో సంచలనం

  ఈ ఘటన అంతా అక్కడి సిసి టివిలో రికార్డు అవ్వడంతో.. ఈ వీడియోని యూట్యూడ్ లో పెట్టారు. ఈ వీడియో చూసిన జనాలు అంతా ముసలమ్మ చేసిన పనికి హాట్స్ ఆఫ్ చెబుతున్నారు. తన కోసం ఆలోచించకుండా.. ప్రజలకి మేలు చేసే పని చేయడం అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఒక్క రోజులోనే ఈ వీడియో కి మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మరి ఆ ముసలమ్మ ఏమి చేసిందో మీరూ ఓ లుక్కేయండి.