తెలుగు సినీ ప్రపంచంలో భారీ తనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది వైజయంతీ మూవీస్ సంస్థ. 25 సంవత్సరాల చిన్న వయస్సులోనే యన్టీఆర్ హీరోగా నటించిన ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో సోలో నిర్మాతగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ సృష్టించిన సంచనాలు అన్నీ.. ఇన్నీ కావు. ఎన్నో ఘన విజయాలు సాధించిన ఆయన్ను అదృష్టం చాలాసార్లు కాపాడిరది. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన పేలుడులో ఓ వ్యక్తి మరణించినప్పటికీ, పదు సంఖ్యలో ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోకుండా కాపాడబడ్డాయి.
వివరాల్లోకి వెళితే కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి కాంబినేషన్‌లో, రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీదత్ ‘అడవి సింహాలు’ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విశాఖ బీచ్‌లో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం రంగు రంగు బెలు న్లు అవసరం అయ్యాయి. ఓవ్యక్తి గ్యాస్ సిలిండ్ సాయంతో బెలున్లలో గాలి నింపుతున్నాడు. అతని చుట్టూ పదుల సంఖ్యలో పిల్లలు, పెద్ద లు చేరారు. అంతా సందడిగా ఉన్న సమయంలో ఎవరో ‘‘అదిగో కృష్ణంరాజు, జయప్రద ఆ కారులో వస్తున్నారు’’ అని అరవడంతో అందరూ అటువైపుగా పరుగు తీశారు.
అంతే బెలున్లలో గ్యాస్ నింపుతున్న సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడం, ఆ వ్యక్తి తల తెగిపడడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఒక్కసారిగా ఆ పరిసరాలు మొత్తం భీతావహ వాతావరణానికి సాక్ష్యాలుగా మారిపోయాయి. అదే కృష్ణంరాజు, జయప్రద అటుగా రాకుండా ఉండి ఉంటే ఆ సిలిండర్ ధాటికి ఇంకెంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో ఊహిస్తేనే ఇప్పటికీ తనకు చమటలు పడతాయని, ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోవడాన్ని విషాధంగా చూడాలో… పదుల సంఖ్యలో ప్రాణాలు సేవ్ అయ్యాయని అదృష్టంగా భావించాలో ఇప్పటికీ అర్ధం కాదు అంటారు అశ్వనీదత్.