ఇద్దరు అబ్బాయిలను ప్రేమించిన అమ్మాయి.. ఒక రోజు

  0
  5802

  ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లు కొత్తమీ కాదు. గతంలో అనేక సినిమాలలో చూసే ఉంటారు. నిజ జీవితంలో కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. అలంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకే చోట పని చేస్తున్న ఓ యువతి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించింది. అయితే ఆ యువతి తనకే దక్కాలని భావించిన ఓ యువకుడు మరొకరిని హత్య చేసాడు.

  మొదట బాగానే ఉండేది

  ఆ వివరాలలోకి వెళితే.. దిలావర్‌పూర్‌ లో ఓ కంటి ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ యువతికి, యువకుడికి పరిచయం అయింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్ళు బాగానే ప్రేమించుకున్నారు. అయితే రాను రాను ఆ యువకుడి ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. దీనితో అతడిని దూరం పెట్టింది. యువకుడు నిర్మల్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రసాద్‌(24) అనే యువకుడు కంపౌండర్‌ గా పని చేస్తున్నాడు. ప్రసాద్‌ తో ఆమెకు పరిచయం అయింది.

  రాత్రి 10 గంటలకు రూమ్ కి వెళ్ళాడు

  ప్రసాద్ తో ఆమె ఎక్కువగా మాట్లాడుతుండడం మొదటి ప్రేమికుడిని నచ్చలేదు. తమ దూరానికి ప్రసాదే కారణం అని భావించిన ఆ యువకుడు అతడి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దీని కోసం ఓ కత్తి కొనుగోలు చేసాడు. ఓ రోజు రాత్రి 10 గంటలకు ఆ యువతి ఉంటున్న రూమ్ కి వెళ్ళాడు. అయితే ఆమె అక్కడ లేదు. ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడంతో ఆ యువతి, ప్రసాద్ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరి యువకులకు మాటా మాటా పెరగడంతో ప్రసాద్ ని కత్తితో పొడిచాడు.

  ఆ యువకుడు అప్పటికే పరార్

  దీనితో ప్రసాద్ అక్కడి కక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించినా అతడి ప్రాణం దక్కలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఆ యువకుడు అప్పటికే పరార్ అయ్యాడు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలించి పట్టుకున్నారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా నిందితుడి పేరు చెప్పడం కుదరదని పోలీసులు చెప్పారు.