నన్ను ప్రేమించి వేరే వాడితో ఎలా తిరుగుతావ్

  0
  1043

  హైదరాబాద్ లో దారుణం జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అతనితో చనువుగా ఉంటుందని ప్రియుడు తట్టుకోలేక పోయాడు. ఆమెని అనుమానిస్తూ కక్ష పెంచుకున్నాడు. మాట్లాడాలని రమ్మని పిలిపించి.. ఆపై హత్యాచారం చేసి హతమార్చాడు. సిసి టివి ఫుటేజీ కారణంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు.

  వేరే వ్యక్తితో సన్నిహితంగా

  ప్రేమలో ఉన్నవాడికి ప్రపంచం తెలియదని అంటారు. కానీ ప్రేమిస్తూ అనుమానంతో బతికే వాడికి ప్రియురాలే నేరస్తురాలిగా కనిపిస్తుందని ఓ ప్రేమోన్మాది నిరూపించాడు. ప్రేమించిన యువతిపైనే ప్రియుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేసాడు. తనని ప్రేమించిన యువతి.. వేరే వ్యక్తితో సన్నిహితంగా తిరుగుతున్నదన్న కారణంతో ప్రియుడు ఈ దారుణానికి ఒడి కట్టాడు.

  ఆమెని అంతమొందించాలని పథకం

  హైటెక్ సిటీ అవుట్ పోస్ట్ దగ్గర ఈ ఘటన జరిగింది. లాలూ ప్రసాద్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి నరేష్ అనే యువకుడితో తిరుగుతుందని గమనించిన లాలూ ప్రసాద్.. కోపంతో ఊగిపోయాడు. ‘నన్ను ప్రేమించి వేరే వాడితో ఎలా తిరుగుతావ్?’ అని బాధితురాలిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెని అంతమొందించాలని పథకం వేసుకున్న లాలూప్రసాద్.. యువతిని హైటెక్ సిటీ అవుట్ పోస్ట్ దగ్గరకి పిలిపించాడు.

  గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు

  అక్కడ హత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసాడు. ఈ దారుణ ఘటనపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో హత్య జరిగిన పరిసరాలలో సిసి ఫోటేజ్ సేకరించారు. అందులో దొరికిన ఫీడ్ ఆధారంగా నిందితుడు లాలూ ప్రసాద్ ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. పోలీసులు విచారణలో హత్య ఎందుకు చేసావని లాలూ ప్రసాద్ ని ప్రశ్నించడంతో.. అందుకు కారణం చెప్పి నేరం అంగీకరించాడు.