కానిస్టేబుల్ తో భర్తకు దొరికిన ఎసై భార్య

    0
    9705

    ఇద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్లే. తప్పు చేసిన వారిని పట్టుకొని శిక్ష పడేలా చేయాల్సిన వాళ్ళు. కానీ కంచే చేను మేసిందనే విధంగా పాడు పని చేసి లాడ్జిలో అడ్డంగా దొరికి పోయారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఎసై చేస్తున్న భర్తే భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. చిత్తూర్ జిల్లాలో ఎసై గా చేస్తున్నాడు శివకుమార్. అతడి భార్య అనంత పురం జిల్లాలో కానిస్టేబుల్ గా చేస్తుంది.

    కర్నూలుకి పిలిపించుకొని లాడ్జిలో దిగింది

    దోరానిపాడులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అబ్దుల్ గాఫెర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవలే ఎసై గా సెలెక్ట్ అయిన శివకుమార్ భార్య సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కర్నూలుకి వెళ్ళింది. అదే సమయంలో గఫర్ ని కూడా కర్నూలుకి పిలిపించుకొని లాడ్జిలో దిగింది. అయితే ఎప్పటి నుండో అనుమానంతో ఉన్న శివకుమార్ ఈ విషయం తెలుసుకున్నాడు.

    భార్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు

    దీనితో పోలీసులను తీసుకువెళ్లి ఆ లాడ్జిపై రైడ్ చేయించాడు. భార్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. పోలీస్ రైడ్ లు జరుగుతున్న సమయంలో శివకుమార్, అతడి భార్య, గఫర్ లు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు.