మా జీపుల్లో పెట్రోలు కొట్టిస్తేనే మీ అమ్మాయిని వెతుకుతాం

    0
    760

    అధికారం చేతిలో ఉంటే ఆ అహంకారమే వేరప్పా.. అందులోనూ ఎదుటివారు పెద్దలైతే చేతులెత్తి దండాు పెట్టడం.. వంగి వంగి వారి కాళ్లు మొక్కడం. అదే వారు పేదలైతే మాటల్లో కాఠిన్యం.. చేతల్లో క్రూరత్వం ఇదీ కొందరు పోలీసు ప్రవర్తన. ఇదే విషయం వివిధ సందర్భాలో నిరూపణ అయింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ పోలీసు వికలాంగురాలైన ఓ పేదరాలి పట్ల ఇలాంటి క్రూరమైన వైఖరినే అవంభించారు. సోషల్‌ మీడియా పుణ్యాన ఈ విషయం బయటకు పొక్కడంతో సదరు సీఐ, ఎస్‌.ఐలపై ఉన్నతాధికాయి చర్యలు తీసుకున్నారు.

    విషయంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వికలాంగురాలైన గుడియా భర్త చనిపోవడంతో యుక్తవయసుకు వచ్చిన కూతురుతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె కూతురిని సమీప బంధువు కిడ్నాప్‌ చేసి తీసుకు పోయాడు. ఈవిషయమై గుడియా పలుమార్లు కాన్పూర్‌ పోలీసుకు రిపోర్ట్‌ చేసింది. అయినా వారు స్పందించలేదు. పైపెచ్చు మా జీప్‌కు పెట్రోలు పోయిస్తే నీ కూతురిని వెతుకుతాం అని చెప్పారు. అక్కడా ఇక్కడా తిరిగి తెలిసిన వారి వద్ద 15వేల రూపాయలు పోగు చేసిన గుడియా పోలీసులకు ఇచ్చింది.

    ఆ డబ్బు తీసుకున్న పోలీసులు డబ్బును పంచుకున్నారు తప్ప ఆమె కుమార్తెను మాత్రం వెతకలేదు. డబ్బు తీసుకున్నా పని కాకపోవడంతో గుడియా పోలీసులను గట్టిగా నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన పోలీసులు అసలు నీ కూతురు మంచిదేనా.. అంటూ చెప్పుకోలేని విధంగా ఆమెను నిందించి, అవమానాలకు గురి చేశారు. ఈ విషయాన్ని ఓ బంధువు వద్ద చెప్పుకుని వాపోయింది గుడియా. ఈ విషయాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఆ బంధువు దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సదరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.