భర్త ఆత్మహత్య.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య.. కారణం అదే

0
1216

ఇటీవల కాలంలో జీవితంతో పోరాడలేక పలువురు ఆత్మహత్య కు పాల్పడుతున్న సంగతి విదితమే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా లోని తెల్లాపూర్‌ లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య కు పాల్పడడం కలచి వేస్తుంది. ఆ వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ లోని విద్యుత్‌నగర్‌ కి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం మొత్తం ఆత్మహత్య కి పాల్పడింది.

ముందుగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత పిల్లలతో కలిసి భార్య కూడా ఆత్మహత్య కి పాల్పడింది. BHEL లో భర్త మధుసూదన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన భార్య తట్టుకోలేక పోయింది. వెను వెంటనే ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేట ఆందోల్‌ చెరువు వద్దకు వెళ్లి, అందులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు మృత దేహాలను వెలికి తీయగా.. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా, ఆర్థిక కారణాల వలెనే కుటుంబం మొత్తం ఆత్మహత్య కి పాల్పడినట్లు తెలుస్తుంది.