రవిప్రకాష్‌ లెగ్గుతో ఆ ఛానల్‌ కూడా మూత పడినట్లే

0
1014

పాపం రవిప్రకాష్‌… టీవీ9 ఛానల్‌ సీఈఓగా తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ సెబ్రిటీల్లో ఒకరిగా పేరొందారు రవిప్రకాష్‌ ఆయన సారధ్యంలో టీవీ9 సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అనంతర పరిణామాల నేపథ్యంలో టీవీ9 సంస్థను మైహోం రామేశ్వరరావు తదితయి కొనుగోలు చేశారు. గతంలోనూ కొందరు టీవీ9ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ రవిప్రకాష్‌ తెరవెనుక నుండి అడ్డుకున్నారు. అయితే రామేశ్వరరావు చేతిలోకి టీవీ9 వెళ్లి పోవడంతో అప్పటి వరకూ రవిప్రకాష్‌ సంస్థను దోచేసిన వైనం నెమ్మదిగా బట్టయలు అయింది. ఆ తర్వాత కేసులతో సతమతమయ్యారు రవిప్రకాష్‌.

కొంతకాం జైలు జీవితం కూడా అనుభవించాడు. స్వంతంగానే ఓ ఛానల్‌ పెడతానని తిరిగిన రవిప్రకాష్‌ చివరికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నుంచి సరోత్తంరెడ్డి కొనుగోలు చేసిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌లో చేరాడు. రవిప్రకాష్‌ చేరిన నాటి నుండి రాజ్‌ న్యూస్‌కు ఆర్థిక భారం ఎక్కువైపోయిందట. రవి టీంకు లక్షల్లో జీతాలు చెల్లించాల్సి రావడం, మరోవైపు యాడ్స్‌ లేక పోవడంతో ఇక ఛానల్‌ నడపడం తన వ్లల కాదని గ్రహించిన సరోత్తంరెడ్డి ఛానల్‌లోని విభాగాల హెడ్‌లను పిలిచి పరిస్థితి చేయి దాటిపోయిందని, నేను రూపాయి కూడా దీని మీద పెట్టలేనని అన్నారట.

రవిప్రకాష్‌ రాజ్‌ న్యూస్‌లో చేరేటప్పుడు మాత్రం నాకున్న పరిచయాతో యాడ్స్‌ కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయని నమ్మబలికాడట. కానీ యాడ్స్‌ తీసుకురావడం సంగతి అటుంచి, కేసీఆర్‌పైన, మై హోం రామేశ్వరరావు, గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌పైన, టీఆర్‌ఎస్‌ మంత్రులుపైన, ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రభుత్వం నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి వస్తోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఏదైనా వర్కవుటు అవుతుందేమోనని సర్వోత్తంరెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టడంతో ఇక ఛానల్‌ మూసివేతకు ప్రిపేర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.