‘గ్రీన్ కార్డు’కు ఆర్థిక మాంద్యం దెబ్బ.. ఊడిపోతున్న ఉద్యోగాలు..!

0
459

ఆర్ధిక మాంద్యంతో అమెరికాలో ఉద్యోగా ఊడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఇండియన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. ట్విటర్ ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులను తొలగించారు. ఇంకొందరైతే ఆయన విధానాలు మింగుడు పడక ఉద్వాసన దారి పట్టారు. ఇక మెటా (ఫేస్ బుక్ మాతృసంస్థ), అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ ఈ మధ్య తాజాగా గూగుల్ తమ ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేమని ఇంత మంది స్టాఫ్ ను కొనసాగించేది లేదని, ర్యాంకుల ప్రకారం కేటాయించి విధుల నుంచి తొలగిస్తామని లేఆఫ్ లు ప్రకటిస్తున్నాయి.

భవిష్యత్ లో కూడా ఉంటుందని హెచ్చరికలు

ఇది భవిష్యత్ లో కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు నరకం అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఉద్యోగం లేకుండా ఇక్కడ ఎలా బతకాలో తెలియక కలవరపడుతున్నారు. ఆశల సౌదం అని అమెరికాకు వచ్చాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను తట్టుకునేలా లేవంటూ వాపోతున్నారు. ట్విటర్ తో మొదలైన తొలగింపుల బాట ఇప్పుడు గూగుల్ వరకూ పాకింది. దాదాపు అన్ని టాప్ కంపెనీలు ఎప్లాయీస్ ను తొలగించాలనుకేనే చూస్తున్నాయి.

వెయింట్ తప్పడం లేదు..

ఐటీ కంపెనీల తొలగింపుతో హెచ్1బీ వీసాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీసాపై అమెరికా వెళ్లిన వారిలో ఎక్కువగా భారతీయులే ఉంటారు. కంపెనీల సడెన్ నిర్ణయంతో చాలా మంది రోడ్డున పడతారు. ఈ వీసా నిబంధన ప్రకారం ఒక కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల్లోపే మరో కంపెనీలో చేరాలి, లేదంటే తిరిగి సొంత దేశం వెళ్లాల్సి ఉంటుంది. ప్రతీ సంవత్సరం అమెరికా 10వేల హెచ్1బీ గ్రీన్ కార్డులను జారీ చేస్తుంటుంది. ఇది యూస్ఏ జారీ చేసిన కార్డుల్లో 7శాతానికి సమానం. ఇప్పటికప్పుడు 5లక్షల మంది హెచ్1బీ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ వెయిటింగ్ లో ఉన్నాయి.

ఏకంగా 18 ఏళ్లు

అంతా ఇంతా కాదు దాదాపు 5 సంవత్సరాల వెయిటింగ్. (మీరు 2020లో దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న 1995). ఇది చైనీయులకు మరింత దూరంగా ఉంది. ఏకంగా 18 ఏళ్లు పడుతుంది. మిగతా దేశాల వారికి ఏడాది వరకే ఉండడం గమనార్హం. చాలా స్టడీస్ కు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఇండియన్స్ ఇప్పటికీ అమెరికానే స్వర్గధామంగా చెప్పుకుంటారు.

ఊడిపోతున్న ఉద్యోగాలు..

మెటా (ఫేస్ బుక్ మాతృ సంస్థ) 11వేల మందిని ఇంటికి పంపింది. ఇందులో దాదాపు వెయ్యి మందికి పైగా మన ఇండియన్సే. ఇందులో 400 మంది వరకూ ఇండియా నుంచే కంపెనీకి సేవలు అందిస్తున్నారు. సిగేట్ టెక్నాలజీ కూడా 3వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ 10వేల మందిని తొలగించి, తమ సంస్థ ఉద్యోగులు వారికి నచ్చిన సంస్థలో మరో ఉద్యోగం పొందేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఒక వేళ ఉద్యోగం పొందలేకపోతే కొంత అమౌంట్ సెటిల్ చేసి పంపుతామని చెప్పింది.

తొలగించేందుకు రంగం సిద్ధం

ఇందులో కూడా అధికంగా భారతీయులు ఉండడం విశేషం. టెస్లా కార్లపై ఇండియా నిబంధనలతో గుర్రుగా ఉన్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ తాను రీసెంట్ గా టేకోవర్ చేసిన ట్విటర్ నుంచి చాలా మంది, అందులో ఎక్కువగా భారతీయులను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ పరిణామాలు అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నాయి.