పల్లెబాట పట్టిన నగరం…

0
180
A city in the countryside sankranthi vibes

వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి అంటారు పెద్దలు. అలాగే వెళితే సంక్రాంతి పండుగకే ఊరు వెళ్లాలి అంటారు మహానగర జనాలు. పండుగలు ఎన్ని వచ్చినా..

సంక్రాంతి తీరే వేరు. అన్ని పండుగలు ఒకరోజు, రెండు రోజులు వస్తే సంక్రాంతి మాత్రం భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజులు వస్తుంది.

కానీ మనంం భోగికి రెండు రోజుల ముందు నుంచి పండగ మూడ్‌లోకి వెళ్లిపోయి.. కనుమ తర్వాత రెండు, మూడు రోజులకు బయటకు వస్తాము.

అంటే దాదాపు వారానికి పైగా జరుపుకునే పండుగ అన్నమాట. అందుకే సంక్రాంతి అంటే అందరికీ అంత ఇష్టం.
సంవత్సర కాలంగా ఉరుకు, పరుగులతో గడిపిన నగర జీవితాన్ని ఈ వారం రోజుల్లో దూరంగా తరిమేసి,

మరో సంవత్సరానికి సరిపడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుకుని తిరిగి నగరానికి చేరుకుంటారు. ఈ వారం రోజుల ఉత్సాహం కోసం ఈ సంవత్సరం కూడా నగరం పల్లెబాట పట్టింది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌ నుంచి జనం ఊర్ల బాట పట్టారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. ఈ కారణంగా రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లు కిక్కిరిసిన జనాలతో సందడిగా మారాయి.

Are you sleeping with your phone next to you

పండగ రద్దీని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ఆర్టీసీ దాదాపు 4 వేల ప్రత్యేక బస్సులను రంగంలోకి దించింది. అలాగే చాలామంది తమ స్వంత వాహనాల్లో పెద్ద ఎత్తున బయలుదేరడంతో నగరంలో ట్రాపిక్‌ జామ్‌ అవ్వడంతో పాటు,

జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
గత రెండు రోజుల నుంచి దాదాపుగా రోజుకు 30 వేల వాహనాలు టోల్‌ ప్లాజాలను దాటుకుని వెళ్లగా,

శుక్రవారం, శనివారం ఈ సంఖ్య 60 వేలకు చేరవచ్చు అని అంచనా. వీటిలో ద్విచక్ర వాహనాలు మినహాయించ బడ్డాయి. ఇవి కూడా పెద్ద ఎత్తున టోల్‌ప్లాజాలను దాటుకుని దూసుకుపోతున్నాయి.

మరోవైపు పల్లెల్లోని ప్రజలు తమ బంధువుల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి కోసం పిండి వంటలు, భోగుపళ్లు, కొత్తబట్టలు ఇలా పలు సంతోషకరమైన సంబరాల ఏర్పాట్లతో తమ వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు.