‘ట్రంప్’ ట్విటర్ ఖాతా ఓపన్‌పై.. ఆయన ఓటింగ్.. గెలిచిందెవరు..?

0
306

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను గతంలో సంస్థ తొలగించింది. అప్పట్లో అదో దుమారం రేపింది. యూఎస్ అధ్యక్షుడికే ఇంత పరాభవమా అంటూ నెటిజన్లు ట్విటర్ పై ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విటర్ ను పూర్తిగా సొంతం చేసున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తాడా..? లేదా..? అన్న సందేహం నెటిజన్లలో మొదలైంది.

మీకే వదిలేస్తున్నా అంటూ

దీనిపై పలు మార్లు నెటిజన్ల మస్క్ ను కూడా ట్విటర్ వేధికగా ప్రశ్నించారట. దీనిపై తాజాగా ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్ ను మళ్లీ తీసుకోవాలా..? లేదా.. మీకే వదిలేస్తున్నా అంటూ తన ఖాతాలో ఓటింగ్ పెట్టారు. విద్వేశ పూరిత వార్తలను అరికట్టేందుకు తాము కొత్త పాలనీ తెచ్చినట్లు మస్క్ వివరించారు. ఇలాంటి వార్తలు ఉంటే వాటి స్థాయిని తగ్గించి డీబూస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

సగం మంది ట్రంప్ కు పాజిటివ్ గా

ఇక ట్రంప్ విషయానికి వస్తే 2021లో క్యాపిటల్ హిల్ పై దాడి నేపథ్యంలో ట్రంప్ ట్విటర్ వేధికగా ఘాటుగా స్పందించారు. దీంతో ఆయన ఖాతాను అప్పట్లో ట్విటర్ తొలగించింది. దీంతో ట్రాంప్ ‘ట్రూత్’ అనే పేరుతో సొంతంగా ఓ సోషల్ మీడియా సంస్థను నడిపిస్తున్నారు. ట్విటర్ రమ్మన్నా తాను వచ్చే ప్రసక్తే లేదని అప్పట్లోనే చెప్పారు ట్రంప్. ఎలాన్ మస్క్ నిర్వహించిన ఓటింగ్ లో 50 లక్షల మంది పాల్గొనగా దాదాపు సగం మంది ట్రంప్ కు పాజిటివ్ గా ఓటేశారు. మస్క్ కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే వ్యవహరిస్తున్నారు.

బాసిజం తట్టుకోలేకనే చాలా మంది

ట్విటర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఉద్యోగులకు మస్క్ పలు ఆదేశాలు జారీ చేశారు. కష్టపడి పనిచేస్తేనే ఉండాలని లేదంటే వెళ్లిపోవచ్చని అల్టిమేటం జారీ చేశారు. దీంతో చాలా మంది బయటకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం (నవంబర్ 18) ఒక్క రోజే దాదాపు 1200 మందికి పైగా రాజీనామా చేసినట్లు ఇంటర్నేషన్ మీడియా పేర్కొంది. కోడింగ్ లో ప్రావీణ్యం ఉన్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ వెంటనే తనను కలవాలని ఉద్యోగులకు మేయిల్ చేశాడని తెలిసింది.

వ్యక్తిగత ఖాతాలో ఫేయిర్ వెల్

మస్క్ షరతులు, బాసిజం తట్టుకోలేకనే చాలా మంది సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ట్విటర్ 2.oకు సహకరిస్తారా.. బయటకు పోతారా..? అంటూ మస్క్ అల్టిమేటంతో బయటకు వెళ్లాలనే చూస్తున్నట్లు చాలా మంది ఉద్యోగులు చెప్తున్నారట. తమ వ్యక్తిగత ఖాతాలో ఫేయిర్ వెల్, శాల్యూట్ ఈమోజీలను పోస్ట్ చేస్తున్నారట. ట్విటర్ లో మస్క్ కొనుగోలుకు ముందు 7500 మంది ఎప్లాయిస్ ఉంటే ప్రస్తుతం 2900 మార్క్ కు పడిపోయారని సమాచారం.