హైదరాబాద్ లో సరి కొత్త టెన్నిస్ అకాడమీ

0
789

హైదరాబాద్ నగరం ఎంతో మంది టెన్నిస్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సానియా మీర్జా లాంటి ప్రపంచ స్థాయి ప్లేయర్ హైదరాబాద్ నుండి రావడంతో.. హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగి పోయింది. ఆ తరువాత కూడా ఎంతో మంది ప్రతిభావంతులను హైదరాబాద్ నగరం వెలుగులోకి తీసుకొచ్చింది. టెన్నిస్ క్రీడ శిక్షణ కోసం దేశంలోని నలుమూలల నుండి ఎంతో మంది చిన్న పిల్లలు, యువ ఆటగాళ్లు హైదరాబాద్ వస్తుండడం విశేషం. దీనితో హైదరాబాద్ లో సరి కొత్త టెన్నిస్ అకాడమీలు నెలకొల్పుతున్నారు.

ITF certified coach తో శిక్షణ

ముఖ్యంగా అనేక ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ITF certified coach సుభాష్ గారు ఈ టెన్నిస్ అకాడమీని హైదరాబాద్ లో నెలకొల్పారు. ఈ టెన్నిస్ అకాడమీకి fitness coach గా సత్య వ్యవహరిస్తున్నారు.

సుచిత్ర సర్కిల్ వద్ద

హైదరాబాద్ లోని సుచిత్ర సర్కిల్ వద్ద ఉన్న st . moses high school గ్రౌండ్ లో ఈ కొత్త టెన్నిస్ అకాడమీని నెలకొల్పారు. ఈ మేరకు సుభాష్ గారు చిన్నపిల్లలకు, యువతకి పిలుపు ఇచ్చారు. తాము ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది క్రీడాకారులను తీర్చి దిద్దామని.. ఇప్పుడు మరింత మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొని వచ్చేందుకు ఈ కొత్త టెన్నిస్ అకాడమీ నెలకొల్పామని చెప్పారు.

హైదరాబాద్ GST కమీషనర్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ GST కమీషనర్ శ్రీనివాస రెడ్డి గారు హాజరు అయ్యారు. వీరితో పాటు st . moses high school ప్రిన్సిపాల్ గారు .. ఇంకా కొంపల్లి అపర్ణ పామ్మేడోవ్స్ నుండి లక్ష్మి ప్రసన్న, శ్యామా, కల్యాణి, ప్రసాద్ గారు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ GST కమీషనర్ శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ టెన్నిస్ లో ప్రతిభ చూపడానికి చిన్న వయసు నుండే తమ పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు తల్లి తండ్రులు వారిని ప్రోత్సహించాలని కోరారు. టెన్నిస్ క్రీడతో పిల్లలు, యువతతో పాటు.. పెద్దవాళ్ళు కూడా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.

 

NOTE : ఈ టెన్నిస్ అకాడమీ లో చేరడానికి 9666302233 , 9553595546 నెంబర్ లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు