రేవంత్ రెడ్డి కి ఇంత మంది సోదరులు ఉన్నారా?

0
198

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం లోకి రావడం తో ఆ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసి, అశేష ప్రజాభిమానం పొందిన రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసారు. ఈరోజు ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసం గా జరగబోతుంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఒక సాధారణ యూత్ లీడర్ గా కెరీర్ ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ నాయకుడిగా ప్రసిద్ధి గాంచాడు. తెలుగు దేశం పార్టీ కి తెలంగాణ లో ఉనికి కోల్పోతుండడం, ఇక ఆ పార్టీ కి భవిష్యత్తు లేదు అనే విషయాన్నీ గమనించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. ఆ పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు, పర్యటనలు చేపట్టిన రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు.

రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదల వెనుక ఆయన కృషి ఎంత ఉందో, ఆయన సోదరుల చేయూత కూడా అంతే ఉంది. రేవంత్ రెడ్డి కి ఏకంగా 7 మంది సోదరులు ఉన్నారు. ఒక సోదరి కూడా ఉంది. పెద్ద అన్నయ్య భూపాల్ రెడ్డి ఒక సబ్ ఇన్సపెక్టర్, ఈయన రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది. అంతే కాకుండా రేవంత్ రెడ్డి మరియు అతని మరో సోదరుడు కొండల్ రెడ్డి ఇద్దరూ కూడా కవల పిల్లలు అట. అంటే ఇద్దరు ఒకే సమయం లో పుట్టారు అన్నమాట. మిగిలిన నలుగురు సోదరులు వివిధ వ్యాపారాల్లో రాణించి గొప్పగా బ్రతుకుతున్నారు. ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని జీరో స్థాయి నుండి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రేంజ్ కి తీసుకొచ్చాడు. 2018 వ సంవత్సరం లో కొండగల్ ప్రాంతం నుండి పోటీ చేసి ఎమ్యెల్యే గా ఓడిపోయాడు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదు. ఉప ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి, ఇక కాంగ్రెస్ పని తెలంగాణ లో అయిపోయింది అని అందరూ అనుకుంటున్నా సమయం లో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ని చేపట్టి, గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ ని బలోపేతం చేసి నేడు ఆ పార్టీ ని అధికారం లోకి తీసుకొచ్చాడు. ఇది కేవలం రేవంత్ రెడ్డి కృషి, పట్టుదల అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.